బిజినెస్

దసరాకల్లా జియో ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ప్రీ-బుకింగ్స్ మొదలైన కేవలం మూడు రోజుల్లోనే దాదాపు 60 లక్షల జియో ఫోన్లు బుక్ అయ్యాయి. ఈ మేరకు రిలయన్స్ రిటైల్ వర్గాలు తెలిపాయి. గత నెల ఆగస్టు 24న జియో ఫోన్ ప్రీ-బుకింగ్స్ మొదలైనది తెలిసిందే. కాగా, ఈ ఫోన్ల పంపిణీని ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి ఉత్సవాల (దసరా) సందర్భంగా ఆరంభించాలని ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన 4జి టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భావిస్తోంది. తొలుత 500 రూపాయల డిపాజిట్‌తో ఈ ఫోన్ బుకింగ్స్ జరగగా, పంపిణీ సమయంలో వినియోగదారుడి నుంచి మరో 1,000 రూపాయలను జియో తీసుకోనుంది. మూడేళ్ల తర్వాత మొత్తం ఈ 1,500 రూపాయలను తిరిగి వినియోగదారులకే జియో ఇచ్చేస్తుంది. ఉచితంగానే లభించే ఈ ఫోన్ కోసం సుమారు కోటి మంది ఆసక్తి కనబరిచారని సైబర్‌మీడియా రిసెర్చ్ తెలిపింది. ఇకపోతే జియో ఫోన్ కస్టమర్లు నెలనెలా 153 రూపాయలకే అపరిమిత డేటాను పొందుతారు. ఈ ఫోన్‌లో మెసేజింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం పలు యాప్‌లుండగా, జియో టీవీ యాప్ వినియోగంతో లైవ్ టీవీని కూడా వీక్షించవచ్చు. దీని కోసం టీవీలతోనూ జియో ఫోన్ కనెక్ట్ అవుతుంది. మరికొన్ని ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌లూ ఇందులో ఉన్నాయి. మరోవైపు దేశీయ ప్రైవేట్ రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. దీపావళి కానుకగా ఓ చౌక 4జి స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నది తెలిసిందే. జియో 4జి ఫీచర్ ఫోన్‌కు పోటీగా వస్తున్న ఎయిర్‌టెల్ 4జి స్మార్ట్ఫోన్ ధర కేవలం 2,500 రూపాయలేనని తెలుస్తోంది. దీని కోసం ఆయా మొబైల్ ఫోన్ తయారీదారులతో ఎయిర్‌టెల్ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వీటిలో లావా, కార్బన్ సంస్థలున్నట్లు వినిపిస్తోంది. ఇక సెప్టెంబర్ ఆఖర్లోగా లేదా అక్టోబర్ ఆరంభంలోగానీ దీన్ని మార్కెట్‌కు పరిచయం చేయాలన్నది ఎయిర్‌టెల్ ఆలోచన.
ఇదిలావుంటే వొడాఫోన్ ఇండియాతో విలీనమవుతున్న ఐడియా సెల్యులార్ కూడా ఓ 4జి ఫీచర్ ఫోన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టాలని చూస్తోంది. దీని ధర కూడా దాదాపు 2,500 రూపాయలుగానే ఉంటుందని ప్రకటించగా, డ్యూయల్ సిమ్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 2జి, 3జి నెట్‌వర్క్‌నూ వినియోగించుకోవచ్చు. మరోవైపు చౌక ధరల మొబైల్స్ తయారీ సంస్థ ఇంటెక్స్ కూడా ఓ 4జి ఫోన్‌ను తెస్తుండగా, టర్బోప్లస్ 4జి పేరుతో నవరత్న ఫీచర్ ఫోన్ సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ 4జి విఒఎల్‌టిఇ ఫీచర్ ఫోన్ ధర 1,999 రూపాయలే.