బిజినెస్

జూలై-సెప్టెంబర్ జిడిపి 7-7.5 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో దేశ జిడిపి వృద్ధిరేటు 7-7.5 శాతంగా ఉండొచ్చని నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అరవింద్ పనగరియా స్థానంలో రాజీవ్ కుమార్ వచ్చినది తెలిసిందే. ఈ సందర్భంగానే ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఏప్రిల్-జూన్‌లో మూడేళ్ల కనిష్టాన్ని తాకుతూ జిడిపి వృద్ధిరేటు 5.7 శాతంగా నమోదైన నేపథ్యంలో ఈసారి జూలై-సెప్టెంబర్‌లో 7-7.5 శాతంగా నమోదు కాగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు 2017-18లో దేశ జిడిపి వృద్ధిరేటు 6.5 శాతంగా ఉండొచ్చని ఎస్‌బిఐ నివేదిక అంచనా వేసింది.

చిత్రం..నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్