బిజినెస్

ఈ ఏడాది రూ.58 వేల కోట్లు సేకరించనున్న పిఎస్‌బిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ బ్యాంక్ సహా ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్‌బిలు) ఈ ఆర్థిక సంవత్సరంలో తమ వాటాలను తగ్గించుకోవడం ద్వారా దాదాపు 58 వేల కోట్ల రూపాయలను సమకూర్చుకోనున్నాయి. బాసిల్-3 నిబంధనలను నెరవేర్చడంతో పాటుగా మొండిబకాయిలులాంటి వాటి కారణంగా అస్తవ్యస్తంగా ఉన్న తమ బ్యాలెన్స్ షీట్లను ఒక దారికి తీసుకు రావడం కోసం అవి ఈ అదనపు నిధులను సమీకరించుకోనున్నాయి. క్వాలిఫైడ్ సంస్థాగత ఇనె్వస్టర్లకు వాటాలను విక్రయించడం ద్వారా దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బిఐ 15 వేల కోట్లను సమీకరించుకోవాలని అనుకుంటోంది. ఈ ఏడాది చివరి నాటికే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అనుకుంటోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశామని, మార్కెట్ సానుకూలంగా ఉన్న సమయంలో మార్కెట్‌కు వెళ్తామని ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీరాయ్ భట్టాచార్య చెప్పారు. కాగా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరువేల కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరున్నర వేల కోట్ల రూపాయలను క్యాపిటల్ మార్కెట్లనుంచి సేకరించాలని అనుకుంటున్నాయి. అలాగే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఐడిబిఐలు చెరో 5 వేల రూపాయలను సేకరించడానికి బోర్డు ఆమోదం కూడా పొందాయి. మరోవైపు యూనియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలోనే 4,500 కోట్ల నిధులను సమీకరించాలని అనుకుంటోంది. 2019 మార్చి 1నుంచి అమలులోకి వచ్చే బాసిల్ -3 నిబంధనలను నెరవేర్చాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు 1.10 లక్షల కోట్ల రూపాయల నిధులను సమీకరించుకోవలసి ఉంటుంది. ప్రభుత్వంనుంచి మూలధనం మద్దతు కింద లభించే 70 వేల కోట్లకు ఇది అదనం.