బిజినెస్

సేవారంగం నత్తనడక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: భారత ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన జిఎస్‌టి విధానం వల్ల వరుసగా రెండో నెలలో కూడా సేవా రంగం నత్తనడక నడుస్తున్నట్లుగా తాజాగా జరిపిన సర్వేలో స్పష్టమైంది. జిఎస్‌టి కారణంగా ఇటు వ్యాపార కార్యకలాపాలు, కొత్త వర్క్ ఆర్డర్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఈ సర్వే తెలిపింది. ముఖ్యంగా జూలై నెల కంటే కూడా ఆగస్టు నెలలో వ్యాపార ఆర్డర్లు, ఉద్యోగాల రేటు మందగించినట్లుగా ఈ సర్వే తెలిపింది. నికెల్ ఇండియా సర్వీసెస్ సంస్థ ఆగస్టు నెలలో 47.5 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నప్పటికీ వరుసగా రెండో నెల కూడా 50 శాతం మార్క్ దిగువకే పరిమితమైందని ఈ సర్వే తెలిపింది. 50 మార్క్‌ను దాటితే వ్యాపార సర్వీసు రంగం ఆశించిన రీతిలో పురోగమిస్తున్నట్లుగా, దాని దిగువకే పరిమితమైతే మందకొడిగా సాగుతున్నట్లుగా పరిగణిస్తారు. వరుసగా రెండు నెలల పాటు ఈ రకమైన మాంద్య పరిస్థితి 2016 నవంబర్, డిసెంబర్‌లో అంటే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేసిన సమయంలోనే ఏర్పడిందని ఈ సర్వే తెలిపింది. ఆగస్టులో తయారీ రంగం మంచి వృద్ధి రేటును సాధిస్తే సేవ, ఉత్పాదక రంగాల మిశ్రమ సూచీ మాత్రం మందకొడి సంకేతాలనే అందించింది.