బిజినెస్

పుంజుకున్న మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, సెప్టెంబర్ 5:ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్షతో సోమవారం భారీగా పడ్డ సెనె్సక్స్ మంగళవారం భారత్-చైనా మధ్య చోటుచేసుకున్న సరికొత్త సయోధ్యతో బలంగా పుంజుకుంది. మంగళవారం జరిగిన లావాదేవీల్లో వివిధ దశల వద్ద ఊగిసలాడిన సెనె్సక్స్ 107.3 పాయింట్లు పుంజుకుని 31,809.55 వద్ద ముగిసింది. అనేక సానుకూల పరిణామాలు సెనె్సక్స్ పుంజుకోవడానికి దోహదం చేశాయి. సేవారంగం వృద్ధిరేటు మందగించినప్పటికీ ఆశాజనకంగా ఉందంటూ తాజా సర్వే చెప్పడం కూడా సెనె్సక్స్‌కు ఊతాన్నిచ్చింది. అలాగే ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా 39.35 పాయింట్లు పెరిగి 9,952.2 వద్ద ముగిసింది. లావాదేవీలు మొదట్లో ప్రతికూలంగా ప్రారంభమైనప్పటికీ అనంతరం క్రమంగా పుంజుకున్నాయి. భారత్-చైనా మధ్య తాజా ద్వైపాక్షిక అనుబంధమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. చమురు, సహజవాయువు, బ్యాంకింగ్ రంగాలు పుం జుకుని సోమవారం చవిచూసిన నష్టాలను కొంతమేర పూడ్చుకోగలిగాయి. అగ్రస్థానంలో నిలిచిన కోల్ ఇండి యా 2.96 శాతం మేర లాభపడింది. అయితే అదానీ పోర్ట్ 1.60 శాతం, బజాజ్ ఆటో 1.58 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.34 శాతం మేర పుంజుకున్నాయి.