బిజినెస్

రాయితీలతోనే రాణింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఇటు వినియోగదారులకు, అటు వర్తకులకు పన్నుల పరంగా లబ్ధితోపాటు ఇతర ప్రోత్సాహకాలను అందించాలని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సిఏఐటి) మంగళవారం సూచించింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలను సాధించడంతోపాటు 2500కోట్ల డిజిటల్ లావాదేవీలను పెంపొందించుకోవాలంటే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు సంబంధించి ఒక నియంత్రణ అథారిటీని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సంస్థ తెలిపింది. కొన్ని రకాల డిజిటల్ చెల్లింపులకు సంబంధించి వినియోగదారులకు పన్లు రిబేట్ ఇవ్వడం అన్నది చాలా కీలకమని, అలాగే వర్తకులకు కూడా అమ్మకం పన్ను రూపంలో ఈ రకమైన ప్రయోజనాలను కల్పించాల్సిన అవసరం ఉందని సమాఖ్య సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు.