బిజినెస్

ఒడిదుడుకుల ట్రేడింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 8: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా స్వల్ప లాభాలకే పరిమితమయ్యా యి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 24.78 పాయింట్లు పెరిగి 31,687.52 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 4.90 పాయింట్లు అందుకుని 9,934.80 వద్ద నిలిచింది. ఇకపోతే తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం సెనె్సక్స్ 204.71 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 39.60 పాయింట్లు క్షీణించింది. గడచిన నాలుగు వారాల్లో సెనె్సక్స్, నిఫ్టీ నష్టపోవడం ఇదే తొలిసారి. ఉత్తర కొరియా భయాలు, విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణలు స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. భారత్‌సహా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లూ నష్టాల్లోనే కదలాడాయి. ఇకపోతే శుక్రవారం ట్రేడింగ్‌లో క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎమ్‌సిజి, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు ప్రముఖ ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, ప్రధాన ఐరోపా దేశాల స్టాక్ మార్కెట్లు మాత్రం నష్టాల్లో నిలిచాయి. ఉత్తర కొరియా దూకుడు ప్రపంచ దేశాలను భయాం దోళనకు గురిచేస్తున్నది తెలిసిందే. దాని క్షిపణి ప్రయోగాలు అగ్ర రాజ్యాలకు సైతం వణుకు పుట్టిస్తుండగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, దానికి అనుగుణంగా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లనూ సహజంగానే ప్రభావితం చేస్తోంది.