బిజినెస్

వారం రోజుల్లో సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ డిపిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలంగాణ రాష్ట్రంలో సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ నెలకొల్పేందుకు వీలుగా తుది వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) రూపొందించాలని వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సి పార్థసారథి ఆదేశించారు. పలు శాఖల నుంచి వచ్చిన సూచనలు, మార్పులు చేర్పులను పరిగణనలోకి తీసుకుని డిపిఆర్ తయారు చేయాలని చెప్పారు. పసుపు సాగుపైనా జిల్లాల వారీగా ఉత్పాదన పెరిగే విధంగా కృషి చేయాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన పసుపును పండించేందుకు పర్యవేక్షించాలని అన్నారు.
పసుపు, సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్‌పై జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ వెజిటబుల్స్, ఫ్లవర్స్‌లో జరిగిన సమావేశంలో పార్థసారథి పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని తెలంగాణ ఉద్యాన శాఖ ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యాన సమగ్ర అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో పసుపు పండించే జిల్లాల్లో పంట విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళిక అమలు జరుగుతోందని చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రాథమిక ప్రాసెసింగ్, మార్కెటింగ్, మాధ్యమిక ప్రాసెసింగ్ ప్రక్రియ కూడా చేపట్టాల్సి ఉందని అన్నారు.
అలాగే మేడ్చల్ జిల్లా దూలపల్లి వద్ద ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్ యూనిట్‌కు సంబంధించి డిపిఆర్‌ను వారం రోజుల్లోగా రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మైసూరులోని సిఎఫ్‌టిఆర్‌ఐ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం మాధవనాయుడు పాల్గొని స్పైస్ ప్రాసెసింగ్ యూనిట్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యాన శాఖ అధికారులకు వారు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, వాణిజ్య శాఖలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.