బిజినెస్

ఈ వారం స్టాక్ మార్కెట్లలోకి మూడు ఐపిఒల రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి మూడు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపిఒ) రానున్నాయి. దాదాపు 6,600 కోట్ల రూపాయల నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ మూడు ఐపిఒలు వస్తుండగా, మ్యాట్రిమొని డాట్‌కామ్, క్యాపసిటి ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్, ఐసిఐసిఐ లాంబార్డ్ సంస్థలు వీటిలో ఉన్నాయి. ఈ నెల 11-13 మధ్య మ్యాట్రిమొని డాట్‌కామ్, 13-15 మధ్య క్యాపసిటి ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్, 15-19 మధ్య ఐసిఐసిఐ లాంబార్డ్ ఐపిఒలు రానున్నాయి. మ్యాట్రిమోని డాట్‌కామ్ ఐపిఒ లక్ష్యం 500 కోట్ల రూపాయలకుపైగా ఉండగా, క్యాపసిటి ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ ఐపిఒ లక్ష్యం 400 కోట్ల రూపాయలుగా, ఐసిఐసిఐ లాంబార్డ్ ఐపిఒ లక్ష్యం 5,700 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక మ్యాట్రిమొని డాట్‌కామ్ షేర్ల ధరల శ్రేణి 983-985 రూపాయలుగా ఉంటే, క్యాపసిటి ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ షేర్ల ధరల శ్రేణి 245-250 రూపాయలుగా, ఐసిఐసిఐ లాంబార్డ్ షేర్ల ధరల శ్రేణి 651-661 రూపాయలుగా ఉన్నాయి.