బిజినెస్

పప్పు్ధన్యాల దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: పప్పు్ధన్యాలు, బంగాళదుంప, చక్కెర ధరలు పెరిగిన నేపథ్యంలో గత నెల టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ద్రవ్యోల్బణం 18 నెలల తర్వాత రుణాత్మక శ్రేణి నుంచి బయటికొచ్చింది. ఏప్రిల్‌లో 0.34 శాతంగా నమోదైంది. అంతకుముందు నెల మార్చిలో -0.85 శాతంగా ఉంటే, నిరుడు ఏప్రిల్‌లో -2.43 శాతంగా ఉంది. 2014 నవంబర్ నుంచి టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు మైనస్‌లోనే నమోదవుతున్నాయి. కాగా, ఉల్లిగడ్డ ధరలు 18.18 శాతం, ఇంధనం, విద్యుత్ చార్జీలు 4.83 శాతం తగ్గినప్పటికీ పప్పు్ధన్యాలు 36.36 శాతం, బంగాళదుంప 35.45 శాతం, చక్కెర 16.07 శాతం చొప్పున పెరగడంతో ఇనాళ్లూ మైనస్‌కే పరిమితమైన డబ్ల్యుపిఐ సూచీ.. ఇప్పుడు 0.34 శాతానికి పెరిగింది. గత వారం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు సైతం పెరిగినది తెలిసిందే. మార్చిలో 4.83 శాతంగా ఉంటే, ఏప్రిల్‌లో 5.39 శాతానికి ఎగిసింది. అయినప్పటికీ వచ్చే నెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఈ ఆర్థిక సంవత్సరాని (2016-17)కిగాను జరిపే రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షపై ఈ ద్రవ్యోల్బణం గణాంకాలు ప్రభావం చూపకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. కీలక వడ్డీరేట్లను ఆర్‌బిఐ తగ్గించవచ్చని ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ నియోటియా అంచనా వేశారు.