బిజినెస్

3 నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో పత్తిసాగు గణనీయంగా పెరిగిందని, రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు, మద్దతు ధర చెల్లించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలంగాణ భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ జిల్లాల కలెక్టర్లతో పత్తి కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ జిఏడి కాన్ఫరెన్స్ హాల్‌లో మంత్రి లక్ష్మారెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఖమ్మం నుండి తుమ్మల నాగేశ్వర్‌రావు, నిజామాబాద్ నుండి పొచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో అక్టోబర్ 3 నుండి పత్తి కొనుగోలును ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల సమన్వయంతో అధికారులు 2017-2018లో పత్తి సాగు చేసిన రైతుల వివరాలు అక్టోబర్ 31లోగా సేకరించి మార్కెటింగ్ శాఖ ద్వారా పత్తి రైతులకు బార్‌కోడ్ కలిగిన గుర్తింపుకార్డులను ముద్రించి అందజేయాలని కలెక్టర్‌లను ఆదేశించారు. పత్తి ఎక్కువగా కొనుగోలు చేసే ప్రాంతాల్లో ఒత్తిడి ఉన్నచోట జిన్నింగ్ మిల్లులను గుర్తించి కొనుగోలు అవకాశాలు కల్పించాలని కలెక్టర్లకు సూచించారు. రైతుల కొనుగోలు కేంద్రాలు దూర ప్రాంతాల్లో ఉంటే రవాణా కోసం దృష్టిలో ఉంచుకొని జిన్నింగ్ మిల్లులు, మార్కెట్ యార్డులను నోట్‌ఫై చేసేందుకు కలెక్టర్లకు అధికారం కల్పించినట్లు తెలిపారు. రైతులు 8నుండి 12 శాతం కన్నా ఎక్కువ తేమ ఉన్న పత్తిని తేవద్దని, 12 శాతం కంటే తేమ ఎక్కువగా ఉంటే సిసిఐ కొనుగోలు చేయదన్నారు. లూజ్ కాటన్ తెమ్మని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నీళ్లు చల్లుకొని తెస్తే 12 శాతం మించి ఉంటే సిసిఐ కొనుగోలు చేయదని, రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. తేమ శాతం 8 నుండి 12 శాతం ఉండాలన్నారు. నిర్ణీత తేమ శాతం ఉంటే 4320 రూపాయల మద్దతు ధర వస్తుందని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, జెసిలు, మార్కెటింగ్ అధికారులు గ్రామాల్లో వివరించాలన్నారు. తేమ యంత్రాలు గ్రామాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు కేంద్రం వద్ద తేమ శాతం మద్దతు ధరపై ఫెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రతి వారం సమీక్ష నిర్వహించాలన్నారు. అన్ని జిల్లాలో కలెక్టర్లు మార్కెటింగ్, వ్యవసాయ శాఖ, సిసిఐ అధికారులతో ముందస్తు సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిన్నింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాటు చేసిన వేబ్రిడ్జ్ తూకంలో రైతులు మోసపోయే అవకాశం ఉన్నందున మార్కెటింగ్, తూనికల కొలతల అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాలన్నారు. రైతులు తూకంలో మోసపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి అధికంగా సాగు చేసే జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రితో పాటు మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిబాయి పాల్గ్గొన్నారు.

చిత్రం..వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న హరీశ్‌రావు