బిజినెస్

ఇండోనేషియా నుంచి పుత్తడి వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: దేశంలోకి బంగారం దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడుతున్నాయి. ప్రత్యేకించి ఇండోనేషియా నుంచి వస్తున్న పుత్తడి దిగుమతులు గత రెండు నెలల్లో గణనీయంగా పెరిగి 600 కిలోల మార్కును దాటాయి. దీంతో ఆందోళన చెందుతున్న ప్రభుత్వం బంగారం దిగుమతులను నియంత్రించేందుకు అనుసరించాల్సిన మార్గాలను పరిశీలిస్తోందని, ఇందుకు సంబంధించి వారం రోజుల్లోనే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. దక్షిణ కొరియా నుంచి బంగారం దిగుమతులు పెరగడంతో వాటిపై ఇటీవల ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఇండోనేషియా నుంచి పుత్తడి దిగుమతులు వెల్లువెత్తున్నాయని ఆ అధికారి తెలిపారు.