బిజినెస్

తూర్పుతీరంలో అతి లోతైన డ్రాఫ్ట్‌ను అందిస్తున్న కృష్ణపట్నం పోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం నౌకాశ్రయం తమ కంటెయినర్ టర్మినల్ డ్రాఫ్ట్‌ను 16 మీటర్లకు పెంచింది. దీంతో దేశంలో తూర్పు తీర ప్రాంతంలో లోతైన డ్రాఫ్ట్ కంటెయినర్ పోర్టుల్లో ఒకటిగా నిలిచినట్లు కృష్ణపట్నం ఓడరేవు డైరెక్టర్ వినీతా వెంకటేష్ చెప్పారు. బల్క్ టర్మినల్ పరంగా భారతదేశంల అతి లోతైన కంటెయినర్ అని ఆమె తెలిపారు. కృష్ణపట్నం ఓడరేవులో ఎగుమతి, దిగుమతులు వేగవంతం చేసేందుకు నూతన సదుపాయం విశేషంగా ఉపయోగపడుతుందన్నారు.
వంద కోట్ల ఆర్డర్‌ను సంపాదించిన బోద్ ట్రీ
ఐటి కనె్సల్టింగ్ సంస్ధ బోద్ ట్రీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి రూ.100 కోట్ల కిమ్మత్తు చేసే ఆర్డర్‌ను సంపాదించింది. ఈ విషయాన్ని ఆ సంస్ధ ఎండి ఎల్‌ఎన్ రామకృష్ణ తెలిపారు. దేశంలోని 550 వైద్య కళాశాలలకు డిజిటల్ మిషన్ మోడ్ ప్రాజెక్టు -2 కోసం తమ సంస్ధ సొల్యూషన్స్ రూపొందిస్తుందన్నారు. ఎంసిఐ సిసిటివి సొల్యూషన్‌ను తమ సంస్ధ రూపొందిస్తుందన్నారు. గత ఏడాది కూడా బోద్ ట్రీ ఎంసిఐ నుంచి రూ.50 కోట్ల ఆర్డర్‌ను సంపాదించింది.
రూ.1800 కోట్ల నిధులను సేకరించిన మైట్రా
హైదరాబాద్‌కు చెందిన సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్ధ మైట్రా సంస్ధ పిరమల్ గ్రూప్ నుంచి రూ.1800 కోట్ల విలువ చేసే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్‌ను సేకరించింది. వీటి కాలపరిమితి ఏడు సంవత్సరాలు. ఈ విషయానన్ని ఆ సంస్ధ సిఇవో విక్రమ్ కైలాస్ తెలిపారు. మైట్రా ఉజ్వల్ పవర్ ప్రైవేట్ సంస్ధలో రొ.820 కోట్లు, మైట్రా ఎనర్జీలో రూ.980 కోట్ల నిధులను పెట్టుబడులుగా ఇనె్వస్ట్ చేయనున్నారు.
ప్రపంచంలో తొలి విఆర్
రెడీ ప్రెసిషన్‌ను ఆవిష్కరించిన డెల్
ప్రెసిషన్ పరికరం శ్రేణిలో కొత్త ప్రెసిషన్ 5720 ఆల్ ఇన్ వన్‌ను డెల్ సంస్ధ మంగళవారం భారత్‌లో ఆవిష్కరించింది.
తయారీ రంగం, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, ఆర్కిటెక్చర్, డిజైన్, ఆరోగ్య రంగం, గ్రాఫిక్స్‌తో విస్తృతంగా పరిశ్రమలకు ఉపయోగపడుతుందని ఆ సంస్ధ గ్రూప్ జనరల్ మేనేజర్ ఇంద్రజిత్ బెల్గుండి తెలిపారు. ఎటువంటి ఆటంకం లదేకుండా టచ్ ద్వారా గ్రాఫిక్ సంబంధిత పనులను ఇది నిర్వహిస్తుంది.