బిజినెస్

3 హోటళ్లనుంచి కేంద్రం నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా మూడు ఐటిడిసి హోటళ్లనుంచి వైదొలగి వాటిలోని తన వాటాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. రాజస్థాన్‌లోని హోటల్ జైపూర్ అశోకా, మైసూరులోని లలిత మహల్ ప్యాలెస్ హోటళ్లను రాజస్థాన్, కర్నాటక రాష్ట్రాలకు అప్పగించడానికి బుధవారం ఇక్కడి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. అలాగే ఇటానగర్‌లోని డోన్యి పోలో అశోకా హోటల్‌లోని 51 శాతం ఐటిడిసి వాటాలను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి అప్పగించాలన్న ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు. జైపూర్ హోటల్‌ద్వారా కేంద్రానికి 14 కోట్లు, మైసూరు హోటల్ ద్వారా రూ.7.45 కోట్లు, ఇటానగర్ హోటల్ ద్వారా రూ.3.89 కోట్లు లభిస్తుందని జైట్లీ చెప్పారు. పెట్టుబడుల ఉపసంహరణ విధానంలో భాగంగా దేశంలోని వివిధ ఐటిడిసి హోటళ్లను రాష్ట్రాలతో కలిసి సంయుక్తంగా లీజ్‌కు లేదా సబ్ లీజ్‌కు ఇవ్వడం జరుగుతుందని జైట్లీ తెలిపారు.