బిజినెస్

కుప్పకూలిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో ప్రారంభంలోనే నష్టాలతో మొదలైన ప్రధాన సూచీలు ఆ తర్వాత ఏ దశలోను పుంజుకోలేదు సరికదా క్రమంగా దిగజారుతూనే వచ్చాయి. ఉత్తర కొరియా వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ల మధ్య మళ్లీ మాటల యుద్దం పెరగడం, డిసెంబర్‌లో వడ్డీరేట్లను పెంచనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడం, చైనా రేటింగ్‌ను తగ్గించడం, డాలరుతో రూపాయి మారకం విలువ ఆరు నెలల కనిష్టస్థాయికి పడిపోవడం, వృద్ధి రేటుకు ఊతం ఇవ్వడం కోసం ప్రభుత్వ వ్యయాన్ని పెంచనుండడంలాంటి ప్రతికూల పరిణామాలతో మార్కెట్లు కుదేలయ్యాయి. దీనికి తోడు సెప్టెంబర్ నెల ఫ్యూచర్స్, ఆప్షన్స్ గడువు దగ్గరపడుతూ ఉండడంతో మిడ్ సెషన్స్‌నుంచి అమ్మకాల జోరు పెరిగింది. ఫలితంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ ఏకంగా 447.60 పాయింట్లు కోల్పోయి 31,922.44 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు పది నెలల తర్వాత సెనె్సక్స్ ఒక రోజులో ఇంత భారీగా పతనం కావడం ఇదే మొదటిసారి. ఈ నెల 11న 31,882.16 పాయింట్లకు పతనమైన తర్వాత సెనె్సక్స్ ఈ స్థాయికి దిగజారడం కూడా ఇదే మొదలు. జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 10 వేల పాయింట్ల సాంకేతిక మద్దతు స్థాయి దిగువకు దిగజారుకొంది. ఒక దశలో 9,952.80 పాయింట్ల కనిష్టస్థాయికి చేరిన సూచీ ఆ తర్వాత కాస్త కోలుకొని మొత్తంమీద 157.50 పాయింట్ల నష్టంతో 9,964.40 పాయింట్ల వద్ద ముగిసింది. రెండు సూచీలు కూడా పది నెలల కనిష్టస్థాయికి పడిపోవడం గమనార్హం. టాటా స్టీల్ 4.70 శాతం, ఎల్‌అండ్‌టి 3.49 శాతం, ఐసిఐసిఐ బ్యాంక్ 2.89 శాతం, ఎస్‌బిఐ 2.53 శాతం, హీరో మోటోకార్ప్ 2.48 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.32 శాతం నష్టంతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అమ్మకాల ఒత్తిడి ప్రభావంతో స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలు కూడా వరసగా 2.93 శాతం, 2.71 శాతం నష్టపోయాయి. అటు డాలరు మారకంతో రూపాయి కూడా భారీగా పతనమైంది.
తొలిరోజే 5 శాతం లాభపడిన
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ షేర్లు
కాగా, శుక్రవారం తొలిసారిగా మార్కెట్లోకి ప్రవేశించిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ షేర్లు దాదాపు 5 శాతం లాభపడ్డాయి. తొలి రోజు బిఎస్‌ఇలో ఈ కంపెనీకి చెందిన 11.5 లక్షల షేర్లు , ఎన్‌ఎస్‌ఇలో 10 లక్షలకు పైగా షేర్లు చేతులు మారినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.