బిజినెస్

రిటైల్ రంగం కొత్త పుంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 2: వ్యాపార రంగంలో భారతదేశం ఇటీవల సాధించిన విజయాలు అనూహ్యమైన ఆర్థిక ఫలితాలను అందిస్తున్నాయి. అంతర్జాతీయంగా అన్ని రంగాల్లోనూ చైనాతో పోటీపడుతున్న భారత్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్యవేత్తలను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా 2017 సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు ఆధిక్యంలో ఉన్న చైనాను అధిగమించి రిటైల్ రంగంలో తిరుగులేని స్థానాన్ని సంతరించుకుంది. గత మూడున్నర సంవత్సరాలుగా కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాపార అనుకూల విధానాలు, అలాగే ఎప్పటికప్పుడు పెట్టుబడులను ఆహ్వానించేందుకు కల్పిస్తున్న సానుకూల పరిస్థితులు రిటైల్ రంగంలో భారత్ మొదటి స్థానాన్ని సంతరించుకోవడానికి దారితీశాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో రిటైల్ వ్యాపారానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయన్నదానిపై ఈ తాజా అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో భారత్ తాజాగా చైనాను అధిగమించి తొలి స్థానాన్ని సంతరించుకుందని ఈ సర్వేలో వెల్లడైంది. రెండురోజులపాటు జరిగిన రిటైల్ ఫోరం సమావేశంలో ఈ అంశానికి సంబంధించి విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ఇంత త్వరితగతిన రిటైల్ రంగ మార్కెట్‌పై భారత్ పట్టు సాధించడానికి ప్రధానంగా నాలుగు అంశాలు దోహదం చేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు. గతానికి భిన్నంగా వినియోగదారుల్లో ఖర్చు సామర్థ్యం పెరిగిందని కేవలం అత్యవసరాలకే కాకుండా ఇతర అంశాలపై కూడా ఖర్చు పెట్టడం ఈ రిటైల్ సూచీలో భారత్ ప్రథమ స్థానాన్ని సంతరించుకోవడానికి దారితీసిందని విశే్లషించారు. దీనితోపాటు మొబైల్ వినియోగం పెరగడం, ఇంటర్నెట్ నలుమూలలా వ్యాపించడం విదేశీ పెట్టుబడులకు అన్నివిధాలుగా అనుకూలమైన వాతావరణం ఏర్పడటం వంటివి కూడా రిటైల్ రంగంలో భారత్‌కు మరింత శక్తినిచ్చాయని తెలిపారు. వీటితోపాటు విప్లవాత్మక రీతిలో వస్తుసేవల పన్ను విధానాన్ని అమలుచేయడం, అదేవిధంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం కూడా భారత్ సాధించిన ఈ తాజా విజయానికి దోహదపడిందని నిపుణులు తెలిపారు. ఏ దేశమైనా వ్యాపార అనుకూల వాతావరణం కలిగిన దేశాలతోనే వ్యాపార వాణిజ్య కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారత్‌లో ఇందుకు పుష్కలమైన అవకాశాలు ఈ మూడున్నర సంవత్సరాల్లో ఏర్పడ్డాయి. దాంతో అంతర్జాతీయంగా పేరెన్నికగన్న ఎన్నో బ్రాండ్లు భారత్‌లోకి అడుగుపెట్టాయి. ఇక్కడ వినియోగదారులను విశేషంగా ఆకర్షించాయి. పారదర్శకత, వ్యాపారానుకూలతే అనేక అంతర్జాతీయ బ్రాండ్లు భారత్‌లో కేంద్రాలను ప్రారంభించేందుకు పోటాపోటీగా ముందుకు రావడానికి కారణమవుతున్నాయన్నది ఎంతైనా నిజం. గత పనె్నండు నుంచి పదిహేను నెలల కాలంలో నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో అనేక సంస్థలు కూడా ఈ రంగంలో ప్రవేశించి తమ ఉనికిని చాటుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. నగదు రహిత లావాదేవీలంటే పూర్తిస్థాయిలో పారదర్శకతకు పట్టం కట్టడమే. ఏ రకమైన అక్రమాలకు తావు లేకుండా సజావుగా లావాదేవీలను సాగించేందుకు అవకాశం ఉండటమే. మెట్రో, వాల్‌మార్ట్, భూకర్ వంటి సంస్థలు తాజాగా భారత మార్కెట్‌లోకి ప్రవేశించడానికి కారణం కూడా వ్యాపారపరమైన పారదర్శకతే. స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్ సంస్థ ఐకియా కూడా భారత్‌లోకి అడుగుపెట్టేందుకు సొంతంగానే ఓ పంపిణీ సంస్థను గానీ గిడ్డంగిని గానీ ఏర్పాటుచేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది చివరికల్లా పుణెలో ఓ సంస్థను ప్రారంభించనున్న ఐకియా వచ్చే ఏడాది మొదట్లో హైదరాబాద్ కేంద్రంగా కూడా తొలి స్టోర్‌ను ప్రారంభించే సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 1.56 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 25 స్టోర్లను ఏర్పాటుచేయాలన్నది ఈ సంస్థ లక్ష్యంగా కనిపిస్తోంది. పెద్దపెద్ద బ్రాండ్లే కాకుండా అనేక చిన్న చిన్న బ్రాండ్లు కూడా భారత్‌లో అడుగుపెట్టేందుకు ప్రత్యేకమైన ఆసక్తి చూపుతున్నాయి. ఈ పరిస్థితులన్నింటికీ ప్రధాన కారణం భారత ప్రభుత్వం ఇటీవల రిటైల్ విధానాన్ని సరళీకృతం చేసి చిన్న చిన్న సంస్థలకు అనువైనదిగా మార్చడమే. అలాగే ఆహార రంగంలో ప్రముఖ సంస్థలు కూడా భారత్‌లోకి రాబోతున్నాయి. వీటితోపాటు ఎవిసు, వాల్‌స్ట్రీట్, పాస్తామానియా, మెల్టింగ్ పాట్, యోగత్ లాబ్ వంటి సంస్థలు కూడా దాదాపు 300 నుంచి 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో దేశంలో దాదాపు మూడువేల స్టోర్లను ఏర్పాటుచేసే సన్నాహాలు చేస్తున్నాయి. ఇదంతా కూడా భారత్‌లో ఇప్పటివరకు ఊహించని పరిస్థితే. 130 కోట్లు జనాభా దాటిన భారతావని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రిటైల్ రంగానికి తిరుగులేని స్థానాన్ని సంతరించుకుంది. రానున్న కాలంలో ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న పెట్టుబడులన్నీ అమలైతే అంతర్జాతీయంగా అన్ని రంగాల బ్రాండ్లకు భారతదేశమే పెట్టని కోట అవుతుంది.