బిజినెస్

సనంద్‌లో ‘టైగొర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ ఇంజన్‌తో నడిచే కాంపాక్ట్ సెడాన్ ‘టైగొర్’ కార్లను ఉత్పత్తి చేయనుంది. 10 వేల ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేయాల్సిందిగా ప్రభుత్వ రంగ సంస్థ ఇఇఎస్‌ఎల్ (ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) నుంచి రూ.1,120 కోట్ల ఆర్డర్ రావడంతో టాటా మోటార్స్ ఈ వాహనాలను ఉత్పత్తి చేయనుందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. దీనిపై టాటా మోటార్స్ అధికార ప్రతినిధిని సంప్రదించగా, ప్రతిస్పందించేందుకు ఆయన నిరాకరించారు. సంవత్సరానికి దాదాపు 2.5 లక్షల వాహనాలను తయారు చేసే సామర్ధ్యమున్న సనంద్ ప్లాంట్‌లో టాటా మోటార్స్ ప్రస్తుతం ‘టైగొర్’ సాంప్రదాయ వెర్షన్ కార్లతో పాటు హ్యాచ్‌బ్యాక్ శ్రేణికి చెందిన ‘టియాగో’ కార్లను, అలాగే ఎంట్రీ లెవెల్‌లోని ‘నానో’ కార్లను ఉత్పత్తి చేస్తోంది.

చిత్రం.. సనంద్‌లోని టాటా మోటార్స్ ప్లాంటు