బిజినెస్

వడ్డీ రేట్లు తగ్గేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 3: దేశ ద్రవ్య విధానంపై సమీక్ష జరిపేందుకు రెండు రోజుల పాటు జరుపనున్న చర్చలను రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) మంగళవారం ముంబయిలో ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధిరేటు 5.7 శాతానికి క్షీణించి గత మూడేళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి దిగజారడంతో ఆర్థిక వృద్ధిరేటుకు ఊతమిచ్చేందుకు కీలక వడ్డీ రేట్లను తగ్గించాలని అటు పారిశ్రామిక వర్గాలతో పాటు ఇటు ప్రభుత్వం కూడా ఆకాంక్షిస్తుండగా, ఆర్థిక నిపుణులు మాత్రం ప్రస్తుతమున్న వడ్డీరేట్లనే యథాతథంగా కొనసాగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లపై ద్రవ్య విధాన కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. రెండు రోజుల పాటు జరిగే ద్రవ్య విధాన కమిటీ చర్చలు బుధవారం మధ్యాహ్నం ముగుస్తాయి. ఈ చర్చలు ముగిసిన తర్వాత బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఎంపిసి ప్రస్తుత (2017-18) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగవ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈ ప్రకటన కోసం అన్ని వర్గాల భాగస్వాములు, ప్రత్యేకించి వడ్డీ రేట్లను తగ్గించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్న పారిశ్రామిక వర్గాలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. అయితే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగినందున ఇప్పటివరకూ ఉన్న వడ్డీ రేట్లనే రిజర్వు బ్యాంకు యథాతథంగా కొనసాగిస్తుందని ఆర్థిక నిపుణులు, ప్రత్యేకించి బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. వృద్ధిరేటు మందగించడం, ద్రవ్యోల్బణం పెరగడం, అంతర్జాతీయంగా ఎదురవుతున్న అనిశ్చిత పరిస్థితుల నడుమ సమస్యల కొలిమిలో చిక్కుకున్న రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని ఎస్‌బిఐ ఇటీవల తన నివేదికలో పేర్కొంది.

పెట్రోల్, డీజిల్‌పై రూ.2 తగ్గిన సుంకం
న్యూఢిల్లీ, అక్టోబర్ 3: పెట్రోలు, డీజిల్‌పై ప్రభుత్వం మంగళవారం నాడు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు 2 రూపాయలు చొప్పున తగ్గించింది. కొత్త ఎక్సైజ్ సుంకం బుధవారం నుంచి అమలులోకి వస్తుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మూడేళ్ల క్రితం అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరగడంతో సుంకాలను పెంచిన ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.21.48, డీజిల్‌పై రూ.17.33 చొప్పున వసూలు చేస్తున్న విషయం విదితమే. అయతే మూడేళ్ల క్రితం అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ దేశంలో ఇంధన ధరలను తగ్గించకపోవడం పట్ల విమర్శలను ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఇప్పుడు ఎట్టకేలకు రూ.2 చొప్పున సుంకాన్ని తగ్గించింది.