బిజినెస్

కీలక రేట్లు యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 4: ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షించిన రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లను ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. రెపో రేటును ప్రస్తుతం ఉన్నట్టుగా ఆరు శాతంగానే కొనసాగించాలని, అలాగే రివర్స్ రెపో, సిఆర్‌ఆర్ రేట్లనూ 5.74, 4శాతానికే పరిమితం చేయాలని సంకల్పించింది. ఈ రేట్లను ఏ మాత్రం పెంచినా ద్రవ్యోల్బణంపై వాటి ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సారథ్యంలో బుధవారం ఇక్కడ సమావేశమైన ద్రవ్య విధాన కమిటీ అన్ని అంశాలనూ, వృద్ధి రేటు తీరు తెన్నుల్ని నిశితంగా పరిశీలించిన మీదట యథాతథ స్థితిని కొనసాగించడానికే మొగ్గు చూపింది. జిఎస్‌టి తదితర అంశాల కారణంగా వృద్ధి రేటు అంచనాలనూ సవరించింది. జిఎస్‌టి అమలు వల్ల తయారీ రంగంపై తీవ్ర ప్రభావం పడిందని పేర్కొన్న రిజర్వ్ బ్యాంకు కొత్తగా పెట్టుబడులు రావడంలో కూడా మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రేటు అంచనాలను 7.3శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించింది. జిఎస్టీ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో తయారీ రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొన్న ఆర్బీఐ, ద్వితీయార్థంలో ఇది పుంజుకునేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే జీడీపీ ఊతం తగ్గిందని, మూడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా 5.6 శాతానికి వృద్ధి రేటు మందగించిందని పేర్కొంది. తయారీ రంగం మందగించడమే కాకుండా, జిఎస్టీ అమలు, పెద్ద నోట్ల రద్దువంటి వాటి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికీ కొనసాగుతుందని వెల్లడించింది. ఇప్పటికీ కూడా తయారీ రంగానికి అనిశ్చితి భవిత కనిపిస్తోందని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల కారణంగా దేశంలోకి పెట్టుబడులను పెద్దఎత్తున తీసుకురావాలన్న ప్రయత్నాలు కూడా అనుకున్న ఫలితాలు ఇచ్చే అవకాశం లేకపోవచ్చని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో ప్రధానంగా పలు అంశాలు వృద్ధిరేటును దెబ్బతీశాయని ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ స్పష్టం చేశారు. అయితే రానున్న రెండు త్రైమాసికాల్లోనూ పరిస్థితులు మెరుగయ్యేందుకు అవకాశాలు లేకపోలేదని స్పష్టం చేశారు. ఆర్థిక వేత్తలు మాత్రం దీన్ని అంతా గణాంకాల గిమ్మిక్కుగానే అభివర్ణిస్తున్నారు. తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు మందగించిన నేపథ్యంలో మొత్తం ఏడాదికి సంబంధించి వృద్ధి రేటు అంచనాలను ఆర్బీఐ ఏవిధంగా తగ్గిస్తుందని ప్రశ్నిస్తున్నారు. కాగా 2019 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ ఆశావహ అంచనాలను ఆవిష్కరించింది. ఇందుకు మామూలుకంటే ఎక్కువ స్థాయిలో వర్షాలు పడటం, పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉండటమేనని తెలిపింది. ప్రస్తుతం జిఎస్టీ వల్ల అనేక సమస్యలు ఉన్నప్పటికీ, అనుకున్న దానికంటే ముందుగానే దీని అమలు ఇబ్బందులు తొలగి వృద్ధికి ఊతం లభించవచ్చని తెలిపింది.