బిజినెస్

కార్పొరేటీకరణతో సిఎస్‌లకు పెరిగిన ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: కంపెనీ సెక్రటరీలు దేశ ఆర్థికాభివృద్ధికి పాటుపడాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గతంలో కన్నా ప్రస్తుతం కంపెనీల సెక్రటరీల అవసరం పెరిగిందని, కార్పొరేటీకరణ ఊపందుకోవడంతో వీరికి ప్రాధాన్యత బాగా పెరిగిందని ఆయన అన్నారు. బుధవారం నాడిక్కడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ స్వర్ణోత్సవాల కార్యక్రమంలో కడియం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ చాలా కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యతను సరిగ్గా నిర్వహించడం లేదన్నారు. ఈ సంస్ధల చేత చట్టాలకు లోబడి పని చేయించాల్సిన బాధ్యత కంపెనీ సెక్రటరీలపైనే ఉందని అన్నారు. హైదరాబాద్ వంటి గ్లోబల్ సిటీలో కంపెనీలు ఎన్ని ఉన్నాయో, ఎంతమంది కంపెనీ సెక్రటరీలు అవసరమో అధ్యయనం చేయాల్సిన అవసరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీలపై ఉందని చెప్పారు. కంపెనీ సెక్రటరీలను తయారు చేసేందుకు ఈ సంస్థతో త్వరలోనే ఉన్నత విద్యా మండలితో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయిస్తానని అన్నారు. ఈ రంగంలో డిప్లోమా కోర్సు ప్రవేశ పెడితే చాలా చిన్న కంపెనీలకు కూడా సెక్రటరీలు అందుబాటులోకి వస్తారని ఆయన ఆకాంక్షించారు.
జిఎస్టీపై ఇంకా అవగాహన రాలేదని, దీనిపై విస్తత్ర ప్రచారం అవసరమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేసిన పెద్ద నోట్ల రద్దు వల్ల అనుకున్నంత మేలు జరగలేదని ఆయన అభిప్రాయడ్డారు. ఐసిఎస్‌ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ వెంకటరమణ మాట్లాడుతూ ఆర్‌బిఐ నిబంధనలు గురించి తమ సంస్థ ఇటీవల పంపిన ప్రతిపాదనల గురించి వివరించారు. జిఎస్‌టి కమిషనర్ ఎం.శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు.