బిజినెస్

నాలుగో రోజూ పుంజుకున్న మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 4: మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగా రిజర్వుబ్యాంక్ పరపతి విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. వరుసగా నాలుగో రోజు కూడా మార్కెట్ పుంజుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు బాగా బలపడ్డాయి. స్వదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు కూడా గుణాత్మక రీతిలో మార్కెట్‌కు ఊతాన్ని ఇచ్చారు. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలన్న ఆర్‌బిఐ నిర్ణయమే ఈ సానుకూల వాతావరణానికి కారణమని వాణిజ్య వర్గాలు తెలిపాయి. అలాగే భారత రూపాయి కూడా అమెరికా డాలర్ మారకంతో మరింత బలపడటం కూడా ఈ సానుకూలతకు అద్దం పట్టింది. వివిధ దశల్లో ఊగిసలాడిన సెనె్సక్స్ లావాదేవీలు ముగిసే నాటికి 174.33 పాయింట్లు పుంజుకుని 31,671.71 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు సెషన్లలో సెనె్సక్స్ ఏకంగా 337 పాయింట్లకు పైగా బలపడిన విషయం గమనార్హం. అలాగే ఎన్‌ఎస్‌ఇ, నిఫ్టీ కూడా 55.40 పాయింట్లు పెరిగి 9,914.90కు చేరుకుంది. 2017-18 సంవత్సరానికి గాను నాలుగు విధానపరమైన పరపతి సమీక్ష జరిపిన ఆర్‌బిఐ రెపో రేట్‌ను ఆరు శాతం వద్దే యథాతథంగా ఉంచింది. అలాగే రివర్స్ రెపో రేటును కూడా 5.75 శాతం వద్దే కొనసాగించింది. నేటి లావాదేవీల్లో ఎస్‌బిఐ షేర్లు 0.82 శాతం పెరిగి రూ.253.35కు చేరుకున్నాయి. అలాగే కోటక్ మహీంద్ర షేర్ కూడా 2.16 శాతం పెరిగి రూ.1,028కు చేరుకుంది. సన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటిసి, డా. రెడ్డీస్ షేర్లు కూడా బలపడ్డాయి. అయితే భారతీయ ఎయిర్‌టెల్ మాత్రం స్వల్పంగా నష్టపోయింది.