బిజినెస్

చేపల ఉత్పత్తిలో ఏపి ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, అక్టోబర్ 5: మత్య్స ఉత్పత్తుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌ఎఫ్‌డిబి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాణికుముదిని అన్నారు. ఆక్వా సాగులో నిషేధించిన యాంటీ బయోటిక్స్ వినియోగానికి రైతులు దూరంగా ఉండాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో గురువారం ఆమె పర్యటించారు. విజేత మెరైన్ ఫుడ్స్, నెక్సస్ ఫీడ్ కంపెనీ, వెల్‌కం ఫిషరీస్‌ను ఆమె పరిశీలించారు. ఎగుమతులకు సిద్ధంగా ఉన్న ఉత్పత్తులను ఎలా పంపిస్తున్నారు, చేపల మేత ఎంత నాణ్యతతో తయారుచేస్తున్నారు, చేపల పెంపకం ఏ విధంగా జరుగుతుంది తదితర అంశాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రాణికుముదిని విలేఖర్లతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఎపిలో ఉత్పత్తితోపాటు నాణ్యత కూడా చూసుకోవాలన్నారు. ఎగుమతుల సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్పత్తిని ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని రాణికుముదిని పేర్కొన్నారు. ఆమె వెంట మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ అంజలి, డిడి డాక్టర్ కె ఫణిప్రకాష్ తదితరులున్నారు.

చిత్రం..భీమవరంలో చేపల ప్రాసెసింగ్ యూనిట్‌ని పరిశీలిస్తున్న ఎన్‌ఎఫ్‌డిబి సిఇ రాణికుముదిని