బిజినెస్

ఈ ఏడాది రైల్వేల్లో 10 లక్షల ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: రైల్వేల ఆధునీకరణ కోసం ట్రాకులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం త్వరలో గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తుందని, దీని ద్వారా ఏడాది వ్యవధిలో 10 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు వీలుంటుందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో భారత ఆర్థిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా గురువారం న్యూఢిల్లీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. గత కొద్ది నెలల్లో జరిగిన పలు రైలు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలను కోల్పోయిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రైల్వేల్లో భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఎటువంటి పరిమితి లేదని రైల్వే శాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన పియూష్ గోయల్ తెలిపారు. ‘ప్రస్తుతమున్న రైలు మార్గాలను మరింత సురక్షితమైనవిగా తీర్చిదిద్దాలని సంకల్పించాం. ఇందుకోసం ఇప్పుడు అందుబాటులో ఉన్న ట్రాకులన్నింటినీ రైలు మార్గాల పునరుద్ధరణకు మళ్లించాం. కొత్త ట్రాకుల కొనుగోలు కోసం త్వరలో గ్లోబల్ టెండర్లను పిలవాలని యోచిస్తున్నాం. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో రైలు మార్గాల డబ్లింగ్‌తో పాటు కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలు కలుగుతుంది’ అని ఆయన వివరించారు. ట్రాకుల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లను ఎప్పుడు పిలుస్తారని విలేఖరులు ప్రశ్నించగా, ప్రస్తుతం ఈ ప్రక్రియ సాగుతోందని, అతి త్వరలోనే టెండర్లను ఆహ్వానించడం జరుగుతుందని చెప్పారు.

చిత్రం..రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్