బిజినెస్

పొంతనలేని లెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) అమలు వల్ల రాష్ట్రాలకు చెల్లించవల్సిన నష్ట పరిహారం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లెక్కలకు పొంతన లేదని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు చెల్లించే నష్ట పరిహారం విషయంలో లెక్కలు పక్కగా ఉండాలని ఆయన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన 22వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం యనమల విలేకరులతో మాట్లాడుతూ, జిఎస్‌టి అమలులో భాగంగా రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహార లెక్కల్లో తేడాలు ఉన్నాయని, ఈ విషయాన్ని జిఎస్‌టి కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. కేంద్రం రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌కు జిఎస్‌టి పరిహారం కింద రూ.175 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.116 కోట్లు మాత్రమే చెల్లించిందని ఆయన తెలిపారు. తమ లెక్కల ప్రకారం జిఎస్‌టి పరిహారం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.116 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని కేంద్ర అధికారులు చెబుతున్నారని, దేశంలోని ఇతర అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్రం ఇదేవిధంగా తక్కువ నష్ట పరిహారాన్ని చెల్లించిందని ఆయన పేర్కొన్నారు. అయతే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో తాను ఈ విషయం గురించి ప్రస్తావించడంతో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పక్కగా నష్ట పరిహారం చెల్లించే విధంగా చూస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. అలాగే సరుకుల రవాణాకు సంబంధించిన ఇ-వే (ఎలక్ట్రానిక్) బిల్లుల అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చిందన్నారు. దేశ వ్యాప్తంగా చెక్‌పోస్టులు తీసివేసిన తర్వాత ఇ-వే బిల్లులు లేకపోతే తప్పుడు లెక్కలకు అవకాశం ఉంటుందని జిఎస్‌టి కౌన్సిల్‌కు వివరించాన్నారు. ఆంధ్ర, తెలంగాణలతో సహా మరికొన్ని ఇతర రాష్ట్రాలు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయని, దేశం వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదనకు అన్ని రాష్ట్రాలు సానుకూలత వ్యక్తం చేశాయని యనమల తెలిపారు. అలాగే జిఎస్‌టి నుంచి చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారని, దీంతో ఆయా పరిశ్రమలకు లబ్ధి చేకురుతుందని ఆయన అన్నారు.

చిత్రం..ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు