బిజినెస్

చైనాకు పెరుగుతున్న ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 7: ఎన్నో ఏళ్ల స్తబ్ధత తర్వాత మన దేశం నుంచి చైనాకు ఎగుమతులు పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది తొలి ఏడు మాసాల (జనవరి-ఆగస్టు)లో మన దేశం నుంచి చైనాకు జరిగిన ఎగుమతులు 40.69 శాతం పెరిగి 10.60 బిలియన్ డాలర్లకు చేరుకోవడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టు నాటికి మన దేశం నుంచి చైనాకు జింకు, ఇనుప ఖనిజం, ఉక్కు ఎగుమతులు గణనీయంగా పెరగడంతో మొత్తం ఎగుమతులు 38.6 శాతం వృద్ధితో 1.26 బిలియన్ డాలర్లకు చేరడమే ఇందుకు కారణం. అయితే మన దేశం నుంచి ఎగుమతులు పెరిగినప్పటికీ చైనా నుంచి దిగుమతుల పెరుగుదల కొనసాగడంతో ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు 44.51 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జనవరి-ఆగస్టు మధ్య కాలంలో భారత్-చైనా ద్వైపాక్షిక వాణిజ్యం 18.34 శాతం వృద్ధి చెంది 55.11 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో మన దేశం నుంచి చైనాకు ఎగుమతులు 40.69 శాతం వృద్ధి చెంది 10.60 బిలియన్ డాలర్లకు చేరగా, ఇదే కాలంలో చైనా నుంచి మన దేశానికి దిగుమతులు 14.02 శాతం వృద్ధి చెంది 44.50 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.