బిజినెస్

ఆ ఘనత మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, అక్టోబర్ 7: దేశంలో విమానయానం సంపన్నులకు మాత్రమే పరిమితమైనది కాదని, తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఇప్పుడు ఇది సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి వచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో శనివారం ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘దేశంలో విమానయానం సంపన్నులకు మాత్రమే పరిమితం కాదు. విమాన యానాన్ని చౌకగా మార్చేందుకు మేము ఎన్నో చర్యలు చేపట్టాం. దీంతో ఇప్పుడు ఇది సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చింది’ అని మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసేందుకు ఆయన రాజ్‌కోట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ, విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ‘స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి మన దేశానికి అసలు విమానయాన విధానమే లేదు. మారుమూల ప్రాంతాలను అనుసంధానించడం, తక్కువ దూరం ఉన్న మార్గాల్లో విమాన చార్జీలను తగ్గించడం ద్వారా ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు మా ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించింది’ అని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి అనే పదానికి నిర్వచనం మారిపోతోందని, ఎంతో మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకే నర్మదా నది జలాలను ఇక్కడికి తీసుకొచ్చామని ఆయన అన్నారు.

చిత్రం.. ప్రధాని నరేంద్ర మోదీ