బిజినెస్

మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 8: దేశంలో అతి పెద్ద ఎలక్ట్రిక్ త్రీవీలర్స్ తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ రానున్న 18 మాసాల్లో దేశవ్యాప్తంగా 10 వేల ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశపెట్టబోతోంది. ఇందుకు గాను మన దేశానికే చెందిన అతిపెద్ద షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ స్మార్ట్-ఇతో ఈ సంస్థ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ మెట్రోరైల్, హెచ్ హైడీడ్, కాండ్‌రాపిడ్ మెట్రో-గుర్గావ్ సహకారంతో 500 వాహనాల మొదటి బ్యాచ్ గుర్గావ్‌లోకి ప్రవేశించిందని ఈసందర్భంగా కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ, పవర్ సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు, సిఇవో సులజ సిరోదియా వౌత్వానీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సేవలను ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లాంఛనంగా ప్రారంభించారన్నారు. సౌకర్యవంతం, సురక్షితం, అందరికీ అందుబాటు ధరల్లో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ వాహనాలకు మెట్రో ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో విజయవాడ, ఇతర నగరాల్లోకి వీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. దేశ నూతన స్మార్ట్ నగరాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజారవాణా వ్యవస్థను అందించడానికి ఈ సంస్థ ఉత్సుకత చూపుతోంది. పూణెకు చెందిన కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ, పవర్ సొల్యూషన్స్ సంస్థ గ్రీన్ మొబిలిటీలో అగ్రగామిగా ఉంది.