బిజినెస్

సింగరేణి విద్యుత్ కేంద్రంలో అత్యుత్తమ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, అక్టోబర్ 8: మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోంది. దేశంలో ఎంపిక చేయబడ్డ అత్యుత్తమ 25 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సింగరేణి థర్మల్ కేంద్రం ఎనిమిదో ర్యాంకు సాధించింది. గత ఆరునెలల కాలంలో అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పిఎల్‌ఎఫ్) సాధించిన థర్మల్ కేంద్రాలను పరిశీలించగా, తొలి 25 కేంద్రాల్లో సింగరేణికి చోటు లభించింది. సింగరేణి థర్మల్ కేంద్రం 86.87 శాతం పిఎల్‌ఎఫ్ సాధించి, ఎనిమిదో స్థానంలో నిలవగా, రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం 82.04 పిఎల్‌ఎఫ్ సాధించి 19 వ స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్‌లోని 750 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బుడ్గెబుడ్గె థర్మల్ కేంద్రం 99.77 శాతం పిఎల్‌ఎఫ్ సాధించి తొలి స్థానం సంపాదించింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం తరచూ అత్యధిక పిఎల్‌ఎఫ్‌కు చేరుతోంది. 2017 ఆగస్టులో 98.43 శాతం పిఎల్‌ఎఫ్ రికార్డయింది. ఈ కేంద్రంలోని మొదటి యూనిట్‌లో గతేడాది ఏప్రిల్‌లో 100 శాతం పిఎల్‌ఎఫ్ సాధించగా, గత ఫిబ్రవరి, మే నెలల్లో కూడా 100 శాతం పిఎల్‌ఎఫ్ సాధించగలిగింది. గత ఆరునెలల కాలంలో ఈ స్టేషన్‌లో 4,613 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, 4,325 మిలియన్ యూనిట్లు గ్రిడ్‌కు సరఫరా చేశారు. అధిక ఉత్పత్తి సాధిస్తున్నందుకు కార్మికులు, ఉద్యోగుల కృషి ప్రధానమైందని, అందరికీ అభినందనలు తెలియచేస్తున్నానని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. శ్రీధర్ నిరంతర పర్యవేక్షణ వల్ల ఇక్కడ అత్యుత్తమ ఫలితాలు సాధ్యమవుతున్నాయని స్పష్టమవుతోంది.