బిజినెస్

పుత్తడి కొనుగోళ్లలో మరింత పారదర్శకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: బంగారం కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలను మరింత పారదర్శకంగా మార్చి, వాటిని అధికార వర్గాలు సులభంగా గుర్తించేలా వీలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో స్పష్టమైన విధానాలను ప్రకటించనుంది. దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో పాటు బంగారం కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీల్లోనూ పరిమితులు విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా పుత్తడి లావాదేవీల్లో అక్రమాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. దీంతో బంగారం రూపంలోకి మారిపోతున్న నల్లధనాన్ని అరికట్టేందుకు, నగల దుకాణాల్లో జరిగే ప్రతి లావాదేవీ గురించి అధికార వర్గాలకు సులభంగా తెలిసేలా వీలు కల్పించేందుకు త్వరలో సరికొత్త మార్గాలను ప్రకటించనున్నట్లు కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. దేశంలోని జెమ్స్ అండ్ జ్యుయలరీ డీలర్లను ప్రభుత్వం ఇటీవల మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) పరిధిలోకి తీసుకొచ్చిన విషయం విదితమే. ఇందుకు సంబంధించి ఆగస్టు 23వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వును జారీ చేసినప్పటికీ బంగారం కొనుగోళ్లకు సంబంధించిన లావావేదేవీలపై ఎటువంటి పరిమితులు విధించలేదు. ఈ ఉత్తర్వు వలన నగల వర్తకుల్లో గందరగోళం తలెత్తడంతో పాటు వ్యతిరేక భావన పెరిగింది. దీంతో సమస్యను చక్కదిద్దడంపై దృష్టి సారించిన ప్రభుత్వం ఆగస్టులో జారీ చేసిన ఉత్తర్వును ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో అధియా మాట్లాడుతూ, పుత్తడి లావాదేవీలకు సంబంధించిన నివేదికలను సమర్పించడంపై త్వరలో స్పష్టమైన పరిమితిని విధించనున్నట్లు తెలిపారు.

చిత్రం..కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా