బిజినెస్

ఇంధన రంగానికి మరింత ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9:దేశంలో ఇంధనరంగాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం మరింతగా కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముఖ్యంగా తూర్పు భారత అవసరాలపై దృష్టి పెడతామని, వౌలిక సదుపాయాలను విస్తరిస్తామని భారత, అంతర్జాతీయ కంపెనీల సీఇఓలనుద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు. అన్ని రంగాలు, ముఖ్యంగా పేదలకు ప్రయోజనం కలిగే రీతిలో స్వచ్ఛమైన, ఇంధన సామర్థ్యం కలిగిన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో భారత్ మరింత ముందుకు వెళ్లాలన్నదే తన ఆశయమని చెప్పారు. సమగ్ర ఇంధన విధానాన్ని చేపట్టాలంటూ వచ్చిన సూచనను అభినందించిన మోదీ అనేక రంగాల్లో విస్తృత సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. చమురు, సహజ వాయువు రంగాల్లో పరిశోధన, వినూత్న ఆలోచనలకు ఎంతో ఆస్కారం ఉందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నట్టు పిఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది.