బిజినెస్

మోసగించారో.. జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: మోసాలకు, తీవ్రమైన కార్పొరేట్ నేరాలకు పాల్పడినట్టు నిర్ధారణ అయిన కంపెనీలు ఇక ముందు ప్రభుత్వ రంగ సంస్థలను కొనుగోలు చేయడానికి జరిగే ప్రక్రియలో పాల్గొనడానికి వీలు లేదు. కొత్త పెట్టుబడుల ఉపసంహరణ మార్గదర్శకాలలో ఈ ఆంక్షలు విధించారు. ప్రభుత్వరంగ సంస్థలలోని వాటాలను ప్రైవేటు కంపెనీలకు అమ్మడానికి నిర్వహించే ప్రక్రియలో మోసాలకు, తీవ్రమైన కార్పొరేట్ నేరాలకు పాల్పడినట్లు న్యాయస్థానాలు నిర్ధారించిన ప్రైవేటు కంపెనీలు పాల్గొనడానికి ఇకముందు కుదరదు. నియంత్రణ సంస్థల చేత దోషారోపణలకు గురయిన లేదా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నుంచి మోసానికి, తీవ్రమైన కార్పొరేట్ నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రైవేటు కంపెనీలు కూడా ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను కొనుగోలు చేయడానికి వీలులేదు. గతంలో బిడ్డర్లను ఎంపిక చేసేటపుడు ప్రభుత్వం సదరు ప్రైవేటు కంపెనీల నికర విలువ, అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుండేది. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సిపిఎస్‌ఇల) వాటాలను కొనుగోలు చేయాలని కోరుకునే ప్రైవేటు సంస్థలకు ఈ అదనపు అర్హతను చేర్చాలని ఇప్పుడు నిర్ణయించింది. అంటే వంచనకు, తీవ్రమైన కార్పొరేట్ నేరాలకు పాల్పడిన కంపెనీలు ఈ ప్రక్రియలో పాల్గొనడానికి అనర్హమైనవిగా ప్రభుత్వం నిర్ణయించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డిఐపిఎఎం) ఇటీవల తన అధికారిక పత్రంలో ఈ విషయం వెల్లడించింది. మోసానికి, తీవ్రమైన కార్పొరేట్ నేరాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయిన ప్రైవేటు కంపెనీలు ఆ ఆదేశాలను సవాలు చేస్తూ న్యాయ స్థానాల్లో అప్పీలు చేసుకున్నప్పటికీ అవి ప్రభుత్వ రంగ సంస్థల వాటాల కొనుగోలు ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హత సంపాదించలేవని డిఐపిఎఎం వివరించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 15వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఎయిరిండియా వంటి కంపెనీలను ప్రభుత్వం ఎంపిక చేసింది.