బిజినెస్

తిరుపతిలో జూమ్ కార్ సేవలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 10: దేశం నలుమూలల నుంచి విమానాలు, రైళ్లు ద్వారా తిరుపతికి వచ్చే భక్తులు, పర్యాటకులు తిరుపతిలో కార్లు సొంతంగా నడుపుకుని తిరగడానికి వీలుగా జూమ్ కార్ సంస్థ మంగళవారం నాడు తన సేవలను ప్రారంభించినట్లు ఆ సంస్థ సిఇఓ గేల్‌మోర్గాన్ తెలిపారు. తిరుమల బాలాజీ నగరంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఈసేవలను ప్రవేశ పెట్టామన్నారు. వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరలను నిర్ణయించామన్నారు. తక్కువగా ఐదు కిలోమీటర్లు దూరం, ఫ్యూయల్ ప్యాకేజీతో కలిపి గంటకు రూ. 70 చొప్పున తమ కార్లను బుక్ చేసుకోవచ్చన్నారు. వినియోగదారులు 10, 15 కిలోమీటర్లకు కూడా వాహనాలను బుక్ చేసుకునే వెసులబాటు కల్పించామన్నారు. వారానికి, నెలకు కూడా వినియోగించుకునేలా అద్దెలు నిర్ణయించామన్నారు. ప్రతి వాహనానికి జిపిఎస్ అమచ్చామన్నారు. ఇందుకు అన్ని రకాల అనుమతులు పొందామన్నారు. వాహనాలు కావాల్సిన వారు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.జూమ్‌కార్.కామ్ దారా వాహనాలను బుక్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాల్లో తమసంస్థ 30లక్షల మంది వినియోగదారులకు సేవలు అందించిందని 10లక్షలకు పైగా ట్రిప్పులు తిరిగామన్నారు. ఇందుకు 3వేల వాహనానలు వినియోగించామన్నారు. నగరంలో 25కార్లను అందుబాటులో ఉంచామని హ్యాచ్ బ్యాక్‌లైన్, ఫోర్డ్‌షిగో, మారుతీ షిప్ట్, హోండా జార్జ్, హూండాయ్, కేటా, మహేంద్ర స్కార్పియో వంటి అన్ని రకాల విలాశవంతమైన కార్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఏపి పర్యాటక శాఖతో తమ సంస్థ అధికారిక భాగస్వామ్యం కలిగిన సెల్ప్ డ్రైవ్ కారు సంస్థగా నిలిచిందన్నారు. తిరుమల, తిరుచానూరు, శ్రీకాళహస్తి, కాంచిపురం, నెల్లూరు, చెన్నయ్ వంటి అనేకప్రాంతాలకు వెళ్ళే వారికి తమ కార్లు అందించనున్నామన్నారు. తిరుపతి కార్యాలయంలో అనుభవం కలిగిన ఐదుగురు సిబ్బందిని నియమించనట్లు చెప్పారు. దక్షిణాది మార్కెట్‌లో వ్యాపార విస్తరణ చేయడమే లక్ష్యంగా ప్రముఖ నగరాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. భారతదేశంలో 27 మెట్రో, నాన్ మెట్రో నగరాల్లో సేవలు అందిస్తున్నామన్నారు. సగటున 60శాతం వాహనాలను తమ సంస్థ ద్వారా వినియోగదారులు వినియోగిస్తున్నారని చెప్పారు. ఏడాదిలోపే తిరుపతిలో 75 కార్లను అందుబాటులో ఉంచాలన్నది తమ లక్ష్యంగా ఆయన తెలిపారు.