బిజినెస్

ప్రస్తుతం మందగించినా.. పుంజుకోవడం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 10: జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు మందగమనంగా కొనసాగుతున్నప్పటికీ రానున్న కొనే్నళ్ల కాలంలో అద్భుత రీతిలో పరుగులు పెట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. గత పదిహేను సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును భిన్న కోణాల్లో విశే్లషించిన ఐఎంఎఫ్ ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా వ్యవస్థాగతంగా భారత్ పుంజుకునే అవకాశం ఉందని, అదేవిధంగా అనుకున్న స్థాయిలో 8 శాతానికి పైగా వృద్ధి రేటును సంతరించుకునేందుకు వీలుంటుందని స్పష్టం చేసింది. అయితే తమ తాజా నివేదికలో మాత్రం 2017 సంవత్సరానికి సంబంధించి గతంలో వెలువరించిన అంచనాలను సవరిస్తూ భారత వృద్ధిరేటును 6.7 శాతంగా అంచనా వేసింది. అంటే గతంలో వేసిన అంచనాల కంటే 0.5 శాతం తక్కువ. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి అమలు కారణంగానే వృద్ధిరేటు 0.5 శాతం మేర గత రెండు అంచనాలతో పోలిస్తే తగ్గే అవకాశం ఉందని ఐఎంఎఫ్ వెల్లడించింది. అలాగే 2018 సంవత్సరానికి సంబంధించి కూడా తన వృద్ధి రేటు అంచనాలను 7.4 శాతానికి అంటే 0.3 పర్సంటేజీ పాయింట్లకు ఐఎంఎఫ్ తగ్గించింది. గతంలో వేసిన అంచనాల కంటే కూడా ఈ అంచనాలు తక్కువగా ఉండటానికి కారణం జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దే కారణమని స్పష్టం చేసింది. 2016లో భారత వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదైంది. అంతకుముందు అంచనాల కంటే ఎక్కువ. భారతదేశంలో వృద్ధి వేగం మందగించిందని అందుకు కరెన్సీ మార్పిడి, అదేవిధంగా ఏడాది మధ్యలో జిఎస్‌టిని అమలుచేయడమే ఈ అర్థికపరమైన అనిశ్చితికి, వృద్ధిరేటు మందగించడానికి కారణమని ఐఎంఎఫ్ తన తాజా ప్రపంచ ఆర్థిక దృక్కోణ నివేదికలో వెల్లడించింది. ఈ వారంలో ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకులు సమావేశం కానున్న తరుణంలో వివిధ దేశాలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులు, వృద్ధిరేటు అంచనాలకు సంబంధించిన నివేదికను ఐఎంఎఫ్ వెల్లడించింది. వృద్ధిరేటుకు సంబంధించినంతవరకు భారత్ కంటే కూడా చైనా స్వల్ప ఆధిక్యతలో ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత అంచనాల కంటే కూడా చైనా వృద్ధి రేటు 0.1 శాతం పెరిగి 6.8 శాతానికి చేరుకునే అవకాశం ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. 2018లో భారత్ బలమైన వృద్ధిరేటును సాధించి అంతర్జాతీయంగా శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశాలు చాలా ఉన్నాయని, చైనా కంటే కూడా వచ్చే ఏడాది భారత వృద్ధి రేటు ఎక్కువగా ఉండవచ్చునని ఈ నివేదిక స్పష్టం చేసింది. అనేక పరోక్ష పన్నులను ఒకే తాటిపైకి తెస్తూ భారత ప్రభుత్వం అమలుచేసిన జిఎస్‌టి విధానం ఆర్థిక సంస్కరణల్లో అత్యంత కీలకమని పేర్కొన్న ఐఎంఎఫ్ దీనివల్ల వృద్ధి రేటు ఎనిమిది శాతానికి పెరిగే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయని పేర్కొంది.
కార్మిక మార్కెట్ నియంత్రణలను సరళతరం చేయడం, అదేవిధంగా భూసేకరణ విధానాల్లోనూ సానుకూల మార్పులు చేయడం వంటివి భారతదేశంలో వ్యాపార అనుకూల వాతావరణం విస్తరించేందుకు దోహదం చేసే అంశాలని ఐఎంఎఫ్ నివేదిక తెలిపింది. 1999 నుంచి 2008 మధ్యకాలంలో భారత సగటు వృద్ధి రేటు 6.9 శాతంగా కొనసాగిందని, అనంతర మూడేళ్ల కాలంలో 8.5 శాతం, 10.3 శాతం, 6.6 శాతంగా కొనసాగిందని వివరించింది. అలాగే 2012, 2013, 2014 సంవత్సరాల్లో భారత వృద్ధి రేటు 5.5, 6.4, 7.5 చొప్పున పెరుగుతూ వచ్చిందని పేర్కొంది. అలాగే, వచ్చే ఏడాది చైనా వృద్ధిరేటు ప్రస్తుతం ఉన్న 6.8 శాతం కంటే 6.5 శాతానికి తగ్గే అవకాశముందని తెలిపింది.