బిజినెస్

బడ్జెట్ మేరకు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 11: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమల శాఖకు విడుదల చేసిన బడ్జెట్ మేరకు పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇచ్చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథరెడ్డి నిర్ణయించారు. బుధవారం వెలగపూడి సచివాలయం, నాల్గవ బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ఆయన శాఖాపరమైన సమీక్ష నిర్వహించారు. 2014, 15, 16తో పాటు అంతకు ముందు నుంచి పెండింగ్‌లో ఉన్న ఇనె్సంటివ్స్ కేసులను పరిశీలించి, వాటికి ప్రస్తుత బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేయాలని అధికారులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పెండింగ్ కేసులు ఏమైనా ఉంటే వాటిని వెంటనే క్లియర్ చేయాలని చెప్పారు. మిగతా పెండింగ్ ఇనె్సంటివ్స్ బడ్జెట్ కేటాయింపులపై సిఎంతో చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు. ఇక ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటున్న కొన్ని పరిశ్రమలు అందుకు తగ్గట్టు ఎంప్లాయిమెంట్ (ఉపాధి) కల్పించడం లేదని, అలాంటి వాటిపై దృష్టి సారించాలని మంత్రి అధికారులను కోరారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూకేటాయింపులు చేస్తామని అధికారులు మంత్రికి చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటులో ఉన్న సమస్యలను టెక్నాలజీని ఉపయోగించుకొని పరిష్కరించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ కమిషనర్ సిద్ధార్థ జైన్, ఎపిఐఐసి ఎండి ఎ.బాబు, ఫుడ్ ప్రాసెసింగ్ సీఈఓ వైఎస్ ప్రసాద్, సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్‌ఎస్ రావత్, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.

అనధికార ఆక్వా సాగుకు కళ్ళెం

ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, అక్టోబర్ 11: అనధికార ఆక్వా సాగుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్ళెం వేయనుంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ఆక్వాసాగు ఎక్కువగా సాగుతోంది. అయితే ఇందులో అధికభాగం అనధికారికంగా సాగుతున్నదే. ఈ అనధికార సాగులో ఉపయోగిస్తున్న యాంటీ బయోటిక్స్ తదితరాల కారణంగా ఎగుమతుల సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని అరికట్టడానికి అనధికార సాగును అడ్డుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన టాస్క్ఫోర్స్ కమిటీ రంగంలోకి దిగి, జిల్లాల వారీ పర్యటనలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. అనధికార సాగుపై ఎంపెడా, మత్య్సశాఖ ఇప్పటికే సర్వే జరుపుతున్నాయి. త్వరలోనే వాటి లెక్కలు తేలతాయి. ఇప్పటికే అనధికార హ్యాచరీలపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆక్వా సాగు జరుగుతున్న జిల్లాల్లో ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ బృందాలు ముమ్మర తనిఖీలు చేస్తున్నాయి. మత్య్సశాఖ కమిషనర్ రమాశంకర్‌నాయక్ ఛైర్మన్‌గా ఉన్న టాస్క్ఫోర్స్ కమిటీ ఆక్వా సాగుతో ఎంతమేర కాలుష్యం ఉత్పన్నమవుతోందనే విషయాన్ని తేల్చనుంది. అలాగే రాష్ట్రం నుంచి జరుగుతున్న ఆక్వా ఎగుమతుల్లో ఎందులో యాంటీ బయోటిక్స్ అవశేషాలుంటున్నాయి, వాటిని ఎక్కడ నిలువరించాలో ఒక నివేదిక ఇవ్వనుంది. ఎంపెడా, మత్య్స విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు, కోస్టల్ ఆక్వా అథారిటీలు పరిశీలన జరిపి నివేదికను సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నియమించిన అపెక్స్ కమిటీకి అందజేస్తోంది. దీని ఆధారంగా నియంత్రణతో కూడిన ఆక్వాసాగు అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసిన అధికారులు కృష్ణ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో వర్క్‌షాప్‌ల పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించనున్నారు.