బిజినెస్

జియోపై ఎయర్‌టెల్ వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: సంచలన ఆఫర్లు, 4జి నెట్‌వర్క్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియోను ఎదుర్కొనేందుకు దేశంలోని అతిపెద్ద మొబైల్ సర్వీసుల ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ మరో అడుగు వేసింది. కేవలం రూ. 1,399కే 4జి స్మార్ట్ఫోన్‌ను తన వినియోగదారులకు అందించాలని నిర్ణయించినట్లు బుధవారం తెలిపింది. దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో చౌక ధరకు అందిస్తున్న ఈ స్మార్ట్ఫోన్ ద్వారా రిలయన్స్ జియోను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఎయిర్‌టెల్ భావిస్తోంది. పెద్ద మొత్తంలో ఈ 4జి స్మార్ట్ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకు రావడానికి కార్బన్ మొబైల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. ఎయిర్‌టెల్ ‘మేరా పెహ్‌లా 4జి స్మార్ట్ఫోన్’ కార్యక్రమంలో భాగంగా కార్బన్‌తో ఈ ఒప్పందం కుదిరిందని, రానున్న కాలంలో మరిన్ని హ్యాండ్‌సెట్ తయారీదారులతో ఒప్పందాలు కుదురుతాయని భారతి ఎయిర్‌టెల్ తెలిపింది. రూ. 1,500 డిపాజిట్ చేస్తే ఇంటర్నెట్ సౌకర్యం గల ఫీచర్ ఫోన్‌ను అందిస్తానని ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో జూలైలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ ఫోన్‌ను తిరిగి ఇచ్చేస్తే డిపాజిట్ చేసిన రూ. 1,500 తిరిగి ఇచ్చేస్తామని కూడా ఆ కంపెనీ ప్రకటించింది. రిలయన్స్ జియో ఈ ప్రకటన చేసిన నేపథ్యంలో 4జి స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకు రానున్నట్టు ఎయిర్‌టెల్ అప్పట్లోనే ప్రకటించింది. తన భాగస్వామ్యం వల్ల సామాన్యులు సయితం భరించగలిగిన ధరకు, ఫీచర్ ఫోన్లు లభిస్తున్న ధరకే స్మార్ట్ఫోన్ మార్కెట్‌లోకి వస్తోందని ఎయిర్‌టెల్ బుధవారం పేర్కొంది. అయితే ఈ 4జి స్మార్ట్ఫోన్‌ను తీసుకున్నప్పుడు కస్టమర్లు ముందుగా రూ. 2,899 చెల్లించాలి.
తరువాత క్రమం తప్పకుండా 36 నెలల పాటు నెలకు రూ. 169 చొప్పున రీచార్జి చేయించుకోవాలి. కస్టమర్లకు 18 నెలల తరువాత రూ. 500, 36 నెలల తరువాత రూ. వెయ్యి కలిపి మొత్తం రూ. 1,500 తిరిగి వెనక్కి ఇచ్చివేయడం జరుగుతుందని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. అందువల్ల వినియోగదారుడికి వాస్తవానికి రూ. 1,399 ధరకే 4జి స్మార్ట్ఫోన్ లభిస్తుందని వివరించింది.
ఎయిర్‌టెల్‌తో ఒప్పందంలో భాగంగా తయారు చేస్తున్న ఈ ఆండ్రాయిడ్ ఆధారిత 4జి స్మార్ట్ఫోన్ కార్బన్ ఎ40 ఇండియాలో రెండు స్లిమ్ స్లాట్‌లు ఉంటాయి. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి ప్రాచుర్యం పొందిన యాప్‌లు ఉంటాయి. నెలవారీ రీచార్జి ప్యాక్‌తో క్యాష్‌బ్యాక్, డాటా, వాయిస్ కాల్స్ వంటి ఇతర ఆఫర్లు వస్తాయని ఎయిర్‌టెల్ వివరించింది. రూ. 169 రీచార్జ్ ప్యాక్ వద్దనుకునే వినియోగదారులు తమ వ్యక్తిగత అవసరాల మేరకు ఎంత మొత్తంలో నయినా రీచార్జి చేసుకోవచ్చని తెలిపింది. అయితే మొదటి 18 నెలల్లో కనీసం రూ. 3వేల మొత్తం మేరకు రీచార్జి చేసుకున్న వినియోగదారులకు మాత్రమే రూ. 500 తొలి క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
తరువాత 18 నెలల్లో అదనంగా మరో రూ. 3వేల మొత్తం మేరకు రీచార్జి చేసుకుంటేనే రూ. వెయ్యి రెండో క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్‌టెల్ తెలిపింది. వినియోగదారుడు క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను వినియోగించుకోవడానికి తన హ్యాండ్‌సెట్‌ను ఎయిర్‌టెల్‌కు కాని కార్బన్‌కు కాని తిరిగి ఇవ్వవలసిన అవసరం లేదని పేర్కొంది.