బిజినెస్

ఆరంభ లాభాలు ఆవిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నష్టాల్లో మార్కెట్లు
90 పాయింట్లు తగ్గిన సెనె్సక్స్
32 పాయింట్లు పడిపోయన నిఫ్టీ

ముంబయి, అక్టోబర్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తిరోగమన ముఖం పట్టాయి. మదుపరులు లాభాలను ఆర్జించడానికి పరుగులు పెట్టడంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ నష్టాలను చవిచూసింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ పది వేల మార్కుకు దిగువనే ముగిసింది. ఈ రెండు ప్రధాన సూచీలు ఆరంభంలో మంచి లాభాలను ఆర్జించినప్పటికీ ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి వాటిని నిలబెట్టుకోలేక పోయాయి. వివిధ కంపెనీలు సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశాయి. టిసిఎస్ రెండో త్రైమాసికంలో తన పనితీరుకు సంబంధించిన గణాంకాలను గురువారం వెల్లడించనుంది. దీంతో మొదలయి వివిధ కంపెనీలు సాధించిన లాభ, నష్టాల గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో మదుపరులు బుధవారం ఆచితూచి అడుగులు వేయడంతో స్టాక్ మార్కెట్ కీలక సూచీలు అంతకు ముందు సాధించిన గరిష్ఠ స్థాయిలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాయి. బుధవారం ఉదయం మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. దేశీయ మదుపరులు కొనుగోళ్లకు ఎగబడటంతో సెనె్సక్స్ 32వేల మార్కును దాటింది. అయితే సెషన్ చివరలో మదుపరులు లాభాలను ఆర్జించడానికి హడావుడి పడటంతో 90.42 పాయింట్లు (0.28 శాతం) నష్టపోయి 31,833.99 వద్ద స్థిరపడింది. సెనె్సక్స్ అంతకు ముందు మూడు సెషన్లలో 332.38 పాయింట్లు పెరిగిన విషయం తెలిసిందే. 50 షేర్లతో కూడిన ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 32.15 పాయింట్లు (0.32 శాతం) నష్టపోయి 9,984.80 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు అది 10,067.25- 9,955.80 పాయింట్ల మధ్య కదలాడింది. ఐఎంఎఫ్ మంగళవారం 2017లో భారత్ సాధించనున్న అంచనా వృద్ధి రేటును 6.7 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఈ విషయం మదుపరులను నిరుత్సాహానికి గురిచేసిందని వ్యాపారులు పేర్కొన్నారు. స్థూలార్థ గణాంకాలు, సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన కార్పొరేట్ ఫలితాలు వెలువడనున్న తరుణంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు.
నిఫ్టీ మిడ్‌క్యాప్ 1.06 శాతం నష్టపోగా, స్మాల్‌క్యాప్ 1.39 శాతం నష్టంతో ముగిసింది. రంగాల వారీ సూచీలు కూడా నిస్తేజంగా ముగిశాయి. ఐటి, ఇంధన రంగాలు మాత్రం వరుసగా 0.55 శాతం, 0.07 శాతం చొప్పున లాభపడగా, మిగతావన్నీ నష్టాలనే చవిచూశాయి. బాగా నష్టపోయిన వాటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియల్టీ, మీడియా రంగాలు ఉన్నాయి. యెస్ బ్యాంక్, వేదాంత, ఎస్‌బిఐ, టాటా మోటార్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రధానంగా నష్టాలను చవిచూశాయి. భారతి ఎయిర్‌టెల్, హెచ్‌పిసిఎల్, భారతి ఇన్‌ఫ్రాటెల్, ఐఒసి, టిసిఎస్‌లు లాభాలను ఆర్జించాయి. ఎన్‌ఎస్‌ఇలో 1,188 షేర్లు నష్టపోగా, 521 షేర్లు లాభాలను మూటకట్టుకున్నాయి. 80 షేర్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇదిలా ఉండగా, బుధవారం ఆసియన్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగియగా, అమెరికా మార్కెట్ రికార్డు స్థాయిలో పెరిగింది. ఐరోపా మార్కెట్లు నిస్తేజంగా సాగాయి.