బిజినెస్

98 శాతం తగ్గిన ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఐదు నెలల్లో (ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) ప్రవాస భారతీయుల నికర డిపాజిట్లు గణనీయంగా 98 శాతం తగ్గాయి. చమురు ధరల్లో ఒడిదుడుకులే ఇందుకు ప్రధాన కారణమని, దీంతో గత ఏడాది తొలి ఐదు నెలల్లో 3.84 బిలియన్ డాలర్లుగా ఉన్న ప్రవాస భారతీయుల డిపాజిట్లు ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో 434 మిలియన్ డాలర్లకు పడిపోయాయని అసోచామ్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గల్ఫ్ ప్రాంతంలోని చమురు సంపన్న దేశాల్లో స్వర్ణయుగం కనుమరుగవుతుండటంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగలేకపోతున్నాయని, దీంతో గత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఐదు నెలలతో పోలిస్తే ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో ప్రవాస భారతీయుల నికర డిపాజిట్లు గణనీయంగా 98 శాతం తగ్గాయని అసోచామ్ స్పష్టం చేసింది. ప్రవాస భారతీయులు సాధారణంగా ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంకులు), నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ రూపీ అకౌంట్, నాన్-రెసిడెంట్ (ఆర్డినరీ) అకౌంట్ లాంటి ఖాతాల్లో తమ సొమ్మును డిపాజిట్ చేస్తుంటారు. అయితే నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ రూపీ అకౌంట్‌లో డిపాజిట్లు 50 శాతానికి పైగా తగ్గినట్లు అసోచామ్ తమ ప్రకటనలో వెల్లడించింది. ప్రవాస భారతీయుల డిపాజిట్లు తగ్గడానికి వడ్డీ రేట్లు సహా వివిధ కారణాలు ఉంటాయని, అయితే ప్రవాస భారతీయుల డిపాజిట్లకు అతిపెద్ద ఆధారంగా ఉన్న గల్ఫ్ దేశాలకు, ప్రత్యేకించి అల్పాదాయ వలస కార్మికులకు ఆర్థిక సమస్యలు పెరగడమే ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు తగ్గడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని అసోచామ్ పేర్కొంది.