బిజినెస్

మల్బరీపై అనంత రైతన్న పట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, అక్టోబర్ 18: మల్బరీ సాగుపై అనంతపురం జిల్లా రైతన్నలు మరింత పట్టు సాధిస్తున్నారు. రాష్ట్రంలోనే మల్బరీ సాగులో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉంది. పదేళ్ళకు ముందు జిల్లాలో సుమారు 60 వేల ఎకరాల్లో మల్బరీ సాగు జరిగేది. వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో జిల్లాలో పండ్లతోటలు ఎండిపోయాయి. భూగర్భజలాలు సైతం అడుగంటిపోయాయనుకున్న సమయంలో 35 వేల ఎకరాల్లో మల్బరీ సాగు జరగడం గమనార్హం. జిల్లాలో మడకశిర, గుడిబండ, అగళి, రోళ్ళ, పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, పరిగి, హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు, కుందుర్పి, కంబదూరు, రామగిరి, కనగానపల్లి, కదిరి, గాండ్లపెంట, నల్లమాడ, తలుపుల, రాప్తాడు, కుడేరు, ఉరవకొండ, బుక్కరాయసముద్రం మండలాల్లో మల్బరీ సాగు నిరంతరంగా కొనసాగుతోంది. వర్షాలు కురవక మల్బరీ సాగును వదులుకున్న రైతన్నలు సైతం ప్రస్తుతం సాగుకు ముందుకొస్తున్నారు. దీంతో మరో 7 వేల ఎకరాల్లో మల్బరీ సాగు పెరగవచ్చని సంబంధిత శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. మల్బరీ సాగు చేస్తున్న రైతన్నలకు సుమారు 7 వేల షెడ్లను రాయితీతో నిర్మింపజేశారు. 20-50 అడుగుల విస్తీర్ణంతో షెడ్ నిర్మాణం చేబట్టాలంటే రూ.4 లక్షలు ఖర్చవుతుంది. షెడ్ నిర్మాణాలపై ఆసక్తి కనబరిచే రైతన్నలకు ఇప్పటికే రూ.82,500 రాయితీ అందజేస్తున్నారు. మరికొంతమంది పేద రైతన్నలు షెడ్ నిర్మాణానికి ముందుకొస్తే వారికి రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ యోజన (ఆర్‌కేవీవై) కింద కేంద్రప్రభుత్వం ద్వారా అందే రూ. 1,37,500 రాయితీ అందజేసి ప్రోత్సహిస్తున్నారు. జిల్లా రైతన్నలు పండించే పట్టును జిల్లాలోనే అమ్ముకునే విధంగా హిందూపురం, కదిరి, ధర్మవరంలో పట్టుగూళ్ళ కొనుగోలు మార్కెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో హిందూపురం పట్టుగూళ్ళ మార్కెట్ రాష్ట్రంలోనే పెద్దది కావడం విశేషం. మల్బరీ బాగా సాగులో ఉన్న సందర్భాల్లో ఈ మార్కెట్లకు రోజుకు 16 టన్నుల పట్టుగూళ్ళు వస్తుంటాయి. సీజన్ తగ్గిన సందర్భాల్లో సుమారు 8 టన్నుల పట్టుగూళ్ళు వస్తుంటాయి. జిల్లాలో మల్బరీ సాగుతో పట్టుగూళ్ళను అభివృద్ధి చేసుకుంటూ ఏడాదికి సుమారు రూ. 800 కోట్లు రైతన్నలు అర్జిస్తున్నారు. మల్బరీ సాగుకు ముందుకొచ్చే ప్రతి రైతుకు షెడ్ల నిర్మాణానికి 50 శాతం రాయితీ అందజేసి ప్రోత్సహిస్తే జిల్లాలో సాగు మరింత పుంజుకునే అవకాశం ఉంది. గత కొనే్నళ్ళుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా మల్బరీ సాగు చేశాక మధ్యలో ఎక్కడ బోర్లలో నీళ్ళడుగంటిపోతాయోనని రైతన్నలు బిక్కుబిక్కుమంటూ సాగు కొనసాగించేవారు. అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండి భూగర్భజలాలు బాగా అభివృద్ధి చెందాయి. దీంతో ఇక రెండేళ్ళ వరకు వ్యవసాయ బోర్లలో నీళ్ళింకిపోయే ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో మల్బరీ రైతన్నలకు మొక్కల పెంపకం, వాటికి చీడపీడలు సోకకుండా మందులు, షెడ్ల నిర్మాణాలు, చందరంకులు, తట్టలు ఎక్కువ రాయితీతో అందజేస్తే మల్బరీ సాగు మరింత ఊపందుకోనుంది. దాంతోపాటు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన పట్టుగూళ్ళ కొనుగోలు మార్కెట్లలో గిట్టుబాటు ధరలందజేస్తే జిల్లాలో సుమారు 80 వేల ఎకరాల్లో మల్బరీ సాగయ్యే అవకాశాలు లేకపోలేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

వర్షాలు కురవడంతో పెరగనున్న మల్బరీ సాగు
- అరుణకుమారి, పట్టుశాఖ జిల్లా సంచాలకులు

వర్షాలు కురవడంతో మల్బరీ సాగు జిల్లాలో మరింత పెరిగే అవకాశం వుంది. మల్బరీ సాగుకు మందుకొచ్చే ప్రతి రైతుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా రాయితీలు అందజేస్తున్నాం. మొదటి నుంచి రాష్ట్రంలో మల్బరీ సాగులో జిల్లా మొదటి స్థానంలో ఉంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన జిల్లాకు చెందిన మల్బరీ రైతులు తిరిగి వస్తున్నారు. వారు తిరిగి మల్బరీ సాగుకే మొగ్గుచూపడం సంతోషకరం. రైతన్నలను ప్రోత్సహించి మల్బరీ సాగు మరింత పెంచడానికి కృషి చేస్తున్నాం.