బిజినెస్

రికార్డులకు బ్రేకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత రెండు రోజులుగా సాగుతున్న బిఎస్‌ఇ, నిఫ్టీ రికార్డులకు బుధవారం బ్రేక్ పడింది. కొన్ని బ్లూచిప్ కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిస్తేజంగా ఉండటం, మదుపుదారులు అమ్మకాలతో లాభాల స్వీకరణకు భారీగా ఒడిగట్టడంతో సెనె్సక్స్ వంద పాయింట్లు కోల్పోయి 32,508.42 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మిశ్రమ పరిణామాలే చోటుచేసుకున్నాయి. నికరంగా 100.74 పాయింట్లను, మంగళవారం నాటి పెరుగుదలతో పోలిస్తే 0.31 శాతం మేర నష్టపోయింది. దీని ప్రభావం వల్ల బ్యాంకింగ్, పిఎస్‌యు, కేపిటల్ గూడ్స్, ఆటో, హెల్త్‌కేర్ తదితర కంపెనీల షేర్లు 6.6 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ కూడా 29.30 పాయింట్లు కోల్పోయి 10,205.15 పాయింట్ల వద్ద ముగిసింది. విదేశీ నిధులు తరలిపోవడంతో పాటు బ్లూచిప్ కంపెనీల రెండో త్రైపాసిక ఆర్థిక ఫలితాలు నిరాశ పరచడం, ఇటీవల భారీగా లాభాలు గడించిన మదుపుదారులు లాభాల స్వీకరణకు పాల్పడటం ఇటు నిఫ్టీ, అటు సెనె్సక్స్ రికార్డులకు బ్రేకు పడటానికి కారణమైందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. దీపావళి పర్వదినం సందర్భంగా మార్కెట్‌లో గురువారం సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర మధ్య ముహూరత్ లావాదేవీలు స్వల్ప వ్యవధి పాటు జరుగుతాయి. నేటి లావాదేవీల్లో ఐసిఐసిఐ, సిప్లా, లూపిన్, బజాజ్ ఆటో, భారతి ఎయిర్‌టెల్, టాటామోటార్స్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా షేర్లు నష్ట పోయాయి. హిందూ సంవత్ సంవత్సరం 2073కు నేడు చివరి సెషన్ కాబట్టి పదుపుదారులు ఆచితూచి వ్యవహరించారు.