బిజినెస్

రైతుకు నేస్తం ‘ఇఫ్కో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఎరువులను సరైన మోతాదులో ఉపయోగించటం, ఆధునిక వ్యవసాయ సంకేతిక పద్ధతులు, నగదు రహిత లావాదేవీల గురించి రైతులకు శిక్షణ ఇచ్చేందుకు సహకార సంస్థ ఇఫ్కో చేపట్టిన కార్యక్రమాల మూలంగా వ్యవసాయదారుల ఆదాయం 2022 నాటికి రెండింతలు అవుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇఫ్కో స్వర్ణోత్సవాల సందర్భంగా పంపించిన సందేశంలో నరేంద్ర మోదీ ఈ విషయం చెప్పారు. రైతుల అభివృద్ధి, సహకార సంస్థల పనితీరు మెరుగుపరిచేందుకు ఇఫ్కో చేస్తున్న కృషి శ్లాఘనీయమని ప్రధాన మంత్రి ప్రశంసలు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎరువుల నీమ్ కోటింగ్ పథకం అమలులో ఇఫ్కో సహకార సంస్థ అత్యంత కీలక పాత్ర నిర్వహించిందని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. నీమ్ కోటింగ్ మూలంగా ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ పూర్తిగా ఆగిపోయిందని ఆయన చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయటం గురించి మాట్లాడుతూ ఇఫ్కో రైతులకు అత్యాధునిక, మంచి వ్యవసాయ విధానాలను రైతులకు నేర్పిస్తోంది, దీనివలన రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసే లక్ష్యాన్ని సాధించటం మరింత సులభం అవుతుందన్నారు. ఇఫ్కో సంస్థను 1967లో 57 సహకార సంస్థలతో ఏర్పాటుచేస్తే ఈ రోజు అది 36వేల సహకార సంస్థలతో మంచి పురోగతిని సాధిస్తోందని నరేంద్ర మోదీ కొనియాడారు. ఇఫ్కో తన 50వ స్థాపనాదినోత్సవం సందర్భంగా దేశంలోని 125 ప్రాంతాల్లో రైతుల శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆయన చెప్పారు. ఇఫ్కో సంస్థ అమలు చేస్తున్న వివిధ శిక్షణా కార్యక్రమాల వలన రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతోంది, ఇఫ్కో అందజేస్తున్న వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం మూలంగా పంటల దిగుబడి పెరుగుతోంది, ఎరువుల వినియోగం తగ్గుతోంది తద్వారా రైతుల ఆదాయం పెరుగుతోందని నరేంద్ర మోదీ చెప్పారు.