బిజినెస్

ఆధార్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 21: బ్యాంకు ఖాతాలతో బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్య అయిన ఆధార్ అనుసంధానం తప్పనిసరని రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బిఐ) శనివారం స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాలతో ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ ఆర్‌బిఐ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని పేర్కొంటూ సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద అడిగిన సమాచారానికి వచ్చిన సమాధానాన్ని ప్రస్తావిస్తూ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆర్‌బిఐ శనివారం ఈ వివరణ ఇచ్చింది. 2017 జూన్ ఒకటో తేదీన అధికార గెజిట్‌లో ప్రచురితమయిన మనీలాండరింగ్ నిరోధక (రికార్డుల నిర్వహణ) రెండో సవరణల నియమాలు- 2017 ప్రకారం బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనసరి అని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సవరించిన నియమాలు చట్టబద్ధమైనవని, బ్యాంకులు తదుపరి ఆదేశాల కోసం వేచి చూడకుండానే వీటిని అమలు చేయవలసి ఉందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జూన్‌లో బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేయడంతో పాటు రూ. 50వేలు, అంతకు మించిన ఆర్థిక లావాదేవీలన్నింటికీ ఆధార్‌ను తప్పనిసరి చేసింది. ఇప్పటికే ఖాతాలు తెరిచి ఉన్న బ్యాంకు ఖాతాదారులు 2017 డిసెంబర్ 31లోగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటి ఆఫ్ ఇండియా (యుఐడిఎ) జారీ చేసిన తమ ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఒకవేళ ఖాతాదారులు ఎవరయినా ఈ గడువులోగా తమ ఆధార్ నంబర్లను బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకోకుంటే, వారి ఖాతాల నిర్వహణను స్తంభింప చేయడం జరుగుతుందని ఆ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం 2017 బడ్జెట్‌లో పర్మనెంట్ అకౌంట్ నంబర్ల (పాన్)తో ఆధార్ నంబర్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది. ఎవరు కూడా పన్నులు ఎగవేయడానికి ఒకటి కన్నా ఎక్కువ పాన్ నంబర్లను వినియోగించకుండా నివారించేందుకు ప్రభుత్వం దీనిని తప్పనిసరి చేసింది.