బిజినెస్

జీడి పరిశ్రమకు జిఎస్‌టి దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, అక్టోబర్ 23: కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం ఒకే పన్ను విధానం కోసం జిఎస్‌టి ప్రవేశపెట్టినా కొన్ని రాష్ట్రాల్లో జీడిపప్పుకు వే బిల్లు విధానం లేకపోవడంతో దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని జీడిపరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జీడిపప్పుకు ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళం జిల్లా, పలాసలోని సుమారు 170కుపైబడి జీడిపరిశ్రమల మనుగడ జిఎస్‌టి ప్రభావంతో ప్రశ్నార్థకంగా మారింది. జీడిపప్పు ఉత్పత్తిలో పలాస దేశంలోనే అగ్రగామిగా ఉంది. అయితే, నేడు ఆశించిన వ్యాపారం లేకపోవడంతో కొన్ని పరిశ్రమలు మూసివేసే దిశగా ఉన్నాయి. ప్రతి ఏటా దసరా నుంచి దీపావళి వరకు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు పెద్దస్థాయిలో పలాస జీడిపప్పు కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఒడిశా రాష్ట్రంలో జీడిపప్పుకు వే బిల్లు విధానం లేకపోవడంతో ఆ ప్రాంతంలో జీడిపప్పు ధరలు తక్కువగా ఉండడంతో ఈ ఏడాది ఆ ప్రాంతం నుంచి జీడిపప్పు కొనుగోళ్ళు జరిగాయి. గడిచిన 40, 50 ఏళ్ళుగా దీపావళికి పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన జీడిపప్పు వ్యాపారులు జీడిపప్పును అధికంగా కొనుగోలు చేసేవారు. ఆంధ్రప్రదేశ్‌లో జీడిపిక్కలు, పప్పుకు వే బిల్లు విధానం అమలు చేస్తుండడంతో పప్పు ధరలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటున్నాయి.
పలాసలో జీడిపప్పు ఉత్పత్తికి అదే స్థాయిలో ముడిసరుకు లభ్యంకాకపోవడంతో ఇక్కడి వ్యాపారులు ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలు నుంచి జీడిగింజలను కొనుగోలు చేస్తున్నారు. దేశీయంగా కేవలం 30 శాతం మాత్రమే జీడిగింజలు లభ్యమవుతుండడంతో 70 శాతం ఇతర దేశాలపై ఆధారపడుతున్నారు. ప్రధానంగా ఆఫ్రికన్ దేశాలైన నైజీరియా, ఇండోనేషియా, ఘనా, బిసాల్ వంటి దేశాలపై ఆధారపడుతున్నారు. విదేశీ జీడిపిక్కల టన్నుకు 2350 డాలర్లు చెల్లిస్తుండడంతో దేశీయంగా వాటి ధర 80 కేజీల జీడిపిక్కల బస్తా 12,800 రూపాయలు పలుకుతుంది. ఈ ఏడాది పండగలు ఉన్నప్పటికీ గతంలో మాదిరిగా జీడిపప్పు ఉత్పత్తిలో పరిశ్రమదారులు వెనుకంజ వేశారు. జెంబో రకం 850 రూపాయలు, 210 రకం 800, 240 రకం 780, 320 రకం 750, 400 రకం 700, జెహెచ్ (అంగబద్ద) 700, నాలుగు ముక్కలు రకం 660, చిన్నముక్క రకం 550, జీడినూక 300 రూపాయలు పలుకుతున్నాయి.