బిజినెస్

బెల్లం పరిశ్రమకు పొంచివున్న ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, అక్టోబర్ 23: దేశంలోనే ప్రసిద్ధిగాంచిన అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో బెల్లం తయారీ సీజన్ క్రమేపీ ఊపందుకుంటుంది. విజయదశమి, దీపావళి తదితర పండుగలు ముగియడంతో ఆదివారం నుండి బెల్లం తయారీ మరింతగా పెరిగింది. అనకాపల్లి పరిసర ప్రాంతాలతోపాటు వివిధ సుదూర ప్రాంతాలకు సైతం బెల్లం తయారీ క్రమేపీ పెరుగుతోంది. దీపావళి పండుగకు ముందు రోజుకు సగటున మూడువేల దిమ్మల బెల్లం వచ్చేది. నాగులచవితి పండుగ ముగిస్తే బెల్లం తయారీ మరింత బాగా ఊపందుకుని రోజుకు సగటున పదినుండి 15వేల దిమ్మల బెల్లం వరకు మార్కెట్‌కు వస్తుంది. ఇటీవల కురిసిన అడపాదడపా వర్షాలకు కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ బెల్లం తయారీని వేగవంతం చేయాలని రైతులు తహతహలాడుతున్నారు. ప్రస్తుతం పలుకుతున్న ధరలు నిలకడగా ఉంటాయన్న నమ్మకం ఇటు రైతుల్లోను, అటు వ్యాపారుల్లోను సన్నగిల్లిపోతుండటమే ఉత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
తగ్గనున్న ధరలు
పక్షం రోజుల కిందట పదికిలోల బెల్లం రికార్డుస్థాయిలో 475 రూపాయల ధర పలికింది. దీపావళి, నాగుల చవితి పండుగలు ముగియనుండటంతో సహజంగానే ధరలు క్రమేపీ తగ్గుముఖం పడతాయి. ఎప్పటిమాదిరిగానే ఈ ఏడాది కూడా బెల్లం ధరలు క్రమేపీ తగ్గుతున్నాయి. ప్రస్తుతం పదికిలోల మంచిరంగు కలిగిన బెల్లం ధర 340 రూపాయలకు మించి పలకడం లేదు. నాసిరకం నలుపురంగు బెల్లం ధర 260 రూపాయల నుండి 300 రూపాయల వరకు పలుకుతోంది. గడచిన ఐదేళ్ళుగా బెల్లం ధరలు నిరాశాజనకంగా పలకడం, చెరకు తోటలకు తెగుళ్ళు సోకడం, సాగుఖర్చులు పెరిగిపోవడం తదితర ప్రతికూలతను రైతాంగం ఎదుర్కొంటుంది. చెరకు సాగుచేసే రైతులు కాయకష్టం సైతం దక్కే పరిస్థితి లేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. దీంతో సాగు విస్తీర్ణం ప్రతీఏటా తగ్గిపోతోంది. జిల్లాలో చెరకు సగటు సాగు విస్తీర్ణం 78వేల హెక్టార్లు కాగా 50వేల హెక్టార్లకు తగ్గిపోయింది. మార్కెట్‌కు సగటున ఏటా 50 లక్షల దిమ్మల బెల్లం వచ్చేది. గతేడాది 30 లక్షల దిమ్మలకు మించి బెల్లం రాలేని పరిస్థితి ఏర్పడింది. చెరకుకు ప్రత్యామ్నాయంగా సరుగుడు, సుబాబుల్, పామాయిల్ తదితర పంటలు వేసి పట్టణాల్లో పనులకు వలస పోతున్నారు. సన్న, చిన్నకారు రైతులు సైతం చెరకు సాగుకు స్వస్తిపలికడంతో పలుచోట్ల భూములు బీడుభూములుగా మారిపోతున్నాయి.
తగ్గిన ఎగుమతులు
అనకాపల్లి మార్కెట్ నుండి ఖమ్మం, వరంగల్ తదితర తెలంగాణలోని ఇతర జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బీహార్ తదితర ఇతర రాష్ట్రాలకు బెల్లం ఎగుమతి జరిగేది. అక్కడ కూడా చెరకు సాగు పెరగడంతో ఇక్కడి నుండి బెల్లం ఎగుమతులు తగ్గిపోయాయి. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో బెల్లానికి రికార్డుస్థాయిలో ధరలు పలికాయి. అయితే, అనూహ్యంగా పెరిగిన ధరలను సద్వినియోగం చేసుకునే పరిస్థితి రైతాంగంలో లేదు. తెగుళ్ళు సోకి, చైరకు పంట ఎండిపోతుండటంతో హడావుడిగా రైతులు అటు బెల్లం తయారీకి, ఇటు సుగర్ ఫ్యాక్టరీకి తరలించారు. దీంతో నింగినంటిన బెల్లం ధరలను అతికొద్దిమంది రైతులు మాత్రమే సద్వినియోగం చేసుకోగలిగారు. గత సీజన్‌లో ఒక దశలో 500 రూపాయలు ధర పలికింది. సగటున 350నుండి 450 రూపాయల వరకు ధరలు నిలకడగా ఉన్నాయి. పెద్దమొత్తంలో ధరకు కొనుగోలు చేసి ఇతర జిల్లాల వ్యాపారులు ఇక్కడి మార్కెట్‌లో నిల్వలు వేశారు. అయితే, అన్‌సీజన్‌లో ఆ ధరలు నిలకడగా లేకపోవడంతో అపార నష్టాలను చవిచూశారు. దీంతో ఈ సీజన్‌లో నిల్వలు వేసేందుకు వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలోని తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ మూతపడగా తాండవ, ఏటికొప్పాక, గోవాడ సుగర్ ఫ్యాక్టరీలు వచ్చే నెలలో క్రషింగ్‌ను ప్రారంభించనున్నాయి. దీంతో చెరకుకు డిమాండ్ పెరగనుంది. అయినప్పటికీ ధరలు నిలకడగా లేకపోతే చెరకు సాగు విస్తీర్ణం పట్ల రైతుల్లో మరింత నిరాశక్తత పెరిగే పరిస్థితి ఉంది. క్రమేపీ బెల్లం పరిశ్రమ ఉనికికే ముప్పు వాటిల్లే పరిస్థితి లేకపోలేదు.