బిజినెస్

‘ఎనర్జీ స్టోరేజ్’పై ‘ముబదాల’ ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 23: ఇంధన నిల్వ వ్యవస్థ (ఎనర్జీ స్టోరేజి సిస్టం)లో పెట్టుబడులకు యుఏఈలోని ‘ముబదాల’ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి బృందం విదేశీ పర్యటన సోమవారం ఆరవ రోజుకు చేరింది. యుఏఈలో ముఖ్యమంత్రి గౌరవార్థం ఆ దేశ సాంస్కృతిక శాఖ మంత్రి షేక్ అల్ నహ్యాన్ విందు ఇచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల కంపెనీ ‘ముబదాల’ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సంస్థ డిప్యూటీ గ్రూపు సిఈవో హోమిత్ అల్‌షిమ్మరీ మాట్లాడుతూ ఇంధన నిల్వ వ్యవస్థలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపారు. సెమీ కండక్టర్స్, మినరల్స్, ఏరో స్పేస్, పునరుత్పాదక ఇంధన రంగం, స్థిరాస్తులు, వౌలిక సదుపాయాలు, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, యుటిలిటీస్, రక్షణ సర్వీసులు, వైద్య ఆరోగ్యం, పెట్టుబడుల రంగాల్లో తమకున్న అనుభవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు షిమ్మరీ వివరించారు. ఆయా రంగాల్లో తమ అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని భారత్‌లో విస్తరించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమన్నారు. రెండంకెల వృద్ధి రేటు దిశగా పయనిస్తోందని, తమ దేశంలో యువ జనాభా అధికమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ‘హ్యాపెనింగ్ స్టేట్’గా ఉందని, వేగంగా అభివృద్ధి చెందుతున్నదని సిఎం వివరించారు.
ప్రపంచ ప్రమాణాలనే తాము గీటురాళ్లుగా నిర్దేశించుకున్నామని, సరళతర వ్యాపారంలో తాము అగ్రగామిగా ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణంలో మీకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. 9 నగరాలు, 27 టౌన్‌షిప్‌లతో గ్రీన్ అండ్ బ్లూ సిటీగా అమరావతిని రూపుదిద్దుతున్నామన్నారు. అమరావతి వచ్చి అక్కడ పెట్టుబడులను పెట్టే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. ప్రపంచంలోని 5 ఉత్తమ నగరాల్లో ఒకటిగా నిలిచేలా అమరావతిని నిర్మిస్తున్నామన్నారు. మీ సారథ్యంలో యుఏఇకి చెందిన ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా మీరు బాధ్యత తీసుకోవాలని షిమ్మరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ అంశంపై సంయుక్త కార్యబృందాన్ని ఏర్పాటు చేద్దామని షిమ్మరీ ప్రతిపాదించగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. వర్కింగ్ గ్రూపులో ముబదాల గ్రూపు నుంచి ముగ్గురు పేర్లను షిమ్మరి సూచించగా, ఏపీ నుంచి అజయ్‌జైన్, సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాస్తి కృష్ణకిషోర్, భారత రాయబార కార్యాలయం నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. కాగా పెట్టుబడులకు అవసరమైన రెగ్యులేటరీ, లీగల్ వ్యవహారాలను వర్కింగ్ గ్రూపు పర్యవేక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సందర్శనకు రావాలని ముఖ్యమంత్రి షిమ్మరీని చంద్రబాబు ఆహ్వానించగా ఆయన సమ్మతిని తెలిపారు. భారత రాయబారి నవదీప్ సూరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.