బిజినెస్

సరిగమల సుమాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడియం, అక్టోబర్ 23: సరిగమలు పలికే సరికొత్త పూలకుండీలు అందుబాటులోకి వచ్చాయి. గాలి తరంగాల ద్వారా వత్తిడిని గ్రహించి అందుకు అనుగుణంగా ప్రతిస్పందించే పూలకుండీలను ముంబైకు చెందిన నర్సరీ రైతులు అభివృద్ధి చేశారు. సరికొత్త పూలకుండీని కడియపులంక సత్యదేవా నర్సరీకి దిగుమతి అయ్యాయి. సోమవారం సత్యదేవ నర్సరీ యాజమాన్యం ఈ పూలకుండీని ప్రదర్శించింది. డ్రెసీనా డ్రాగో అనే ఇండోర్ మొక్కను పొదిగిన పూలకుండీలను విక్రయానికి సిద్ధం చేశారు. ఈ కుండీ లోపల సాఫ్ట్‌వేర్‌తో కూడిన పరికరాలు అమర్చారు. మొబైల్ మాదిరిగా ఈ కుండీని ఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. రాత్రి వేళల్లో సప్తవర్ణాలు కలిగిన వెలుగు ఈ కుండీ నుండి వస్తుంది. అలాగే సంగీత ధ్వనులను పలు రకాలుగా విన్పించే విధంగా సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ఈ సరికొత్త మొక్కను కానుకగా ఇవ్వడానికి చాలామంది ఇష్టపడతారని సత్యదేవా నర్సరీ యజమాని, సర్ అర్దర్ కాటన్ నర్సరీమెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లా చంటి, మాజీ అధ్యక్షులు పుల్లా అబ్బులు, నర్సరీ రైతులు వీర్రాజు, పెద సత్యనారాయణ, రామకృష్ణ తదితరులు తెలిపారు. కాగా దీని ధర సుమారు వెయ్యి రూపాయలుంటుందని వారు పేర్కొన్నారు.