బిజినెస్

టిఎస్‌టిసిఎల్‌కు బెస్ట్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టిఎస్‌టిసిఎల్)కు ‘బెస్ట్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీ’ అవార్డు 2017 లభించింది. ఈ అవార్డును ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యుసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐపిపిఎఐ) అందజేయనుంది. ట్రాన్స్‌కో తరఫున ఈ అవార్డును ప్రాజెక్టులు, గ్రిడ్ ఆపరేషన్ డైరక్టర్ జి.నరసింగరావు ఈ నెల 28న కర్ణాటకలోని బెల్గావిలో జరిగే ‘రెగ్యులేటర్స్ అండ్ పాలసీ మేకర్స్ రిట్రీట్’లో స్వీకరించనున్నారు. నాణ్యమైన విద్యుత్‌ను, సరిపడే విధంగా, ట్రాన్స్‌మిషన్ నష్టాల్లేకుండా ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గాను ఈ అవార్డుకు టిపిపిఎఐ ఎంపిక చేసింది.
రానున్న యాసంగి పంటకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన ప్రణాళిక అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా అభినందించింది.