బిజినెస్

మళ్లీ పుంజుకున్న సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 23: మూడు రోజుల పాటు పడిపోయిన బిఎస్‌ఇ సెనె్సక్స్ ఈ వారం తొలి రోజే పుంజుకుంది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో పైకి, కిందికి కదలాడిన సెనె్సక్స్ చివరకు 116.76 పాయింట్లు (0.36 శాతం) పెరిగి 32,506.72 పాయింట్ల వద్ద ముగిసింది. టెలికం, ఇంధనం, చమురు- సహజ వాయువు, బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లు లాభపడటంతో సెనె్సక్స్ పైకి ఎగబాకింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్‌టెల్, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభపడటంతో 30 షేర్లతో కూడిన సూచీ సెనె్సక్స్ పుంజుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌కు చెందిన విస్తృతమైన సూచీ నిఫ్టీ కూడా ఇంట్రా డేలో 10,200 పాయింట్ల మార్కును దాటి, చివరకు 38.30 పాయింట్లు (0.38 శాతం) పెరిగి 10,184.85 పాయింట్ల వద్ద స్థిరపడింది.
అంతకు ముందు నిఫ్టీ గరిష్ఠంగా 10,224.15 పాయింట్లు, కనిష్ఠంగా 10,124.50 పాయింట్ల మధ్య కదలాడింది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో మధ్యాహ్నం తరువాత మదుపరులు కొనుగోళ్లలో చురుకుగా పాల్గొనడంతో నిఫ్టీ సానుకూలంగా ముగియగలిగిందని ఏంజెల్ బ్రోకింగ్ ప్రధాన విశే్లషకుడు (టెక్నికల్, డెరివేటివ్స్) సమీత్ చవన్ పేర్కొన్నారు. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాలలో ఆదాయాలు పెరుగుతాయనే అంచనాలతో పాటు సానుకూల గ్లోబల్ వృద్ధి రేటు కారణంగా మార్కెట్ తిరిగి పుంజుకుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రీసెర్చ్ విభాగం అధినేత వినోద్ నాయర్ తెలిపారు. చిన్న, మధ్య తరహా వ్యాపారులపై భారాన్ని తగ్గించడానికి జిఎస్‌టి రేట్లను పునఃపరిశీలించాలని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా ఆదివారం చేసిన సూచన స్టాక్ మార్కెట్లకు సెంటిమెంట్‌గా ఊతమిచ్చిందని బ్రోకర్లు పేర్కొన్నారు. మొత్తంమీద గత మూడు వరుస సెషన్లలో 243.68 పాయింట్లు దిగజారిన సెనె్సక్స్ నాలుగో సెషన్ అయిన సోమవారం తిరిగి పుంజుకుంది. సంవత్ 2074 ప్రారంభం రోజున ప్రత్యేకంగా గురువారం సాయంత్రం గంట సేపు నిర్వహించిన ముహూరత్ సెషన్‌లో ఫారిన్ ఫండ్ ఉపసంహరణల కారణంగా సెనె్సక్స్ 194.39 పాయింట్లు పడిపోయింది.
సోమవారం నాటి ట్రేడింగ్‌లో సెనె్సక్స్‌లోని 30 షేర్లలో 16 షేర్లు అధిక స్థాయిల్లో ముగియగా, 14 షేర్లు దిగువ స్థాయిలో ముగిశాయి. భారతి ఎయిర్‌టెల్ అత్యధికంగా 4.99 శాతం లాభపడగా, 3.05 శాతం పెరుగుదలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ దాని తరువాత స్థానాన్ని ఆక్రమించింది.