బిజినెస్

ఉభయతారకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 26: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే పర్యాటకులను మలేషియా టూరిజం వైపునకు ఆకర్షించేందుకు వీలుగా జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బెర్‌హద్, మలేషియా టూరిజం ప్రమోషన్ బోర్డు మధ్య వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా మార్కెట్ వ్యూహం, వ్యూహాత్మక అభివృద్ధి, వ్యాపార ప్రచార కార్యక్రమం వంటి అంశాల్లో పని చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. హైదరాబాద్-మలేషియా మధ్య లక్ష మంది ప్రయాణీకులు ప్రతి ఏటా ప్రయాణిస్తున్నారు. జిహెచ్‌ఐఎఎల్ సిఈఓ ఎస్‌కె కిషోర్ గురువారం నాడిక్కడ మాట్లాడుతూ ఈ రకమైన ఒప్పందం చేసుకోవడం దేశంలో ఇదే ప్రథమమని అన్నారు. దీని ద్వారా మలేషియా టూరిజం కోసం వెళ్లే పర్యాటకుల సంఖ్య రెట్టింపు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దక్షిణ భారత దేశం, సెంట్రల్ ఇండియాకు కీలకమైనదని, ఈ ప్రాంతాల్లోని టైర్ 2, 3 కేటగిరి నగరాల నుంచి హైదరాబాద్ మీదుగా వారికి కావాల్సిన చోట్లకు ప్రయాణించేందుకు వీలు ఉందని తెలిపారు. ఎంఏహెచ్‌బి ఎండి దాతుక్ మహ్మద్ బద్లిషమ్ గాజల్, మలేషియా టూరిజం ప్రమోషన్ బోర్డు డిప్యూటీ డైరక్టర్ జనరల్ అబ్ధుల్ ఖాని దాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.