బిజినెస్

వేగం తగ్గని మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/ న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా రికార్డును సృష్టించే పరుగును కొనసాగించాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ రెండూ కూడా గురువారం తాజాగా జీవితకాల గరిష్ఠ స్థాయి వద్ద ముగిశాయి. సెనె్సక్స్ 104.63 పాయింట్లు పుంజుకొని 33,147.13 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 48.45 పాయింట్లు పెరిగి 10,343.80 పాయింట్ల వద్ద స్థిరపడింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వృద్ధి రేటుకు ఊతమివ్వడానికి రూ. 9లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడంతో ఈ రెండు కీలక మార్కెట్ సూచీలు బుధవారం జీవితకాల గరిష్ఠ స్థాయిలకు ఎగబాకిన విషయం తెలిసిందే. అదే పరుగును గురువారం కూడా కొనసాగించి మరింత ముందుకు సాగాయి. 30 షేర్లతో కూడిన సెనె్సక్స్ గురువారం ఉదయం 33,025.17 పాయింట్ల వద్ద ప్రారంభమయినప్పటికీ మదుపరులు గరిష్ఠ స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పూనుకోవడంతో ఒక దశలో 32,835.06 పాయింట్లకు పడిపోయింది. తరువాత పుంజుకొని ఇంట్రా-డేలో గరిష్ఠ స్థాయి 33,196.17 పాయింట్లకు ఎగబాకింది. చివరలో 33,147.13 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెనె్సక్స్ బుధవారం నాటి క్లోజింగ్ 33,042.50 పాయింట్లను అధిగమించి మొత్తం మీద 104.63 పాయింట్లు (0.32 శాతం) పుంజుకుంది. సోమవారం నుంచి గురువారం వరకు నాలుగు రోజుల్లో సెనె్సక్స్ 764.20 పాయింట్లు పెరిగింది.
అదేవిధంగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ గురువారం 10,355.65 పాయింట్ల నుంచి 10,271.85 పాయింట్ల మధ్య కదలాడి చివరకు 10,343.80 పాయింట్ల వద్ద స్థిరపడింది. బుధవారం నాటి రికార్డు ముగింపు 10,295.35 పాయింట్లను అధిగమించి మరో 48.45 పాయింట్లు (0.47 శాతం) పుంజుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు పుంజుకోవడంతో బ్యాంకింగ్ రంగ షేర్లు 5.60 పాయింట్లు పెరిగాయి. నిరర్ధక ఆస్తుల భారంతో కుంగిపోయిన ప్రభుత్వ రంగ బ్యాంకులకు చేయూతను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 2.11 లక్షల కోట్ల మూలధన ప్యాకేజీ సానుకూల ప్రభావం మదుపరులపై గురువారం కూడా కొనసాగడంతో బ్యాంకింగ్ షేర్ల ధరలు మరింత పెరిగాయి. అయితే, బుధవారం ఏకంగా 27.58 శాతం లాభంతో నింగినంటిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) షేర్లు గురువారం 1.25 శాతం తగ్గాయి. గురువారం పుంజుకున్న షేర్లలో సిప్లా, మారుతి, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టి, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, విప్రో, ఎంఅండ్‌ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. రంగాల వారీగా చమురు- సహజ వాయువు, క్యాపిటల్ గుడ్స్, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆటో, ఆరోగ్య సంరక్షణ, ఇంధనం, స్థిరాస్తి రంగాలు పుంజుకున్నాయి. బిఎస్‌ఇ స్మాల్ క్యాప్ సూచీ 0.61 శాతం, మిడ్ క్యాప్ సూచీ 0.50 శాతం చొప్పున పెరిగాయి.
స్టాక్ ఎక్స్చేంజీలు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, బుధవారం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పిఐలు) నికరంగా రూ. 3,582.50 కోట్ల విలువ గల షేర్లను, దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు (డిఐఐలు) నికరంగా రూ. 155.71 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.