బిజినెస్

మొండి బకాయలతో కునారిల్లుతున్న బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 27: దేశంలోని ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన ఐసిఐసిఐ బ్యాంకు ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో 30 శాతం క్షీణించింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో 2,979 కోట్ల రూపాయలుగా ఉన్న తమ నికర లాభం ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 2,071.38 కోట్లకు పడిపోయిందని, మొండి బకాయిలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ఐసిఐసిఐ బ్యాంకు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో రూ.32,435 కోట్లుగా ఉన్న తమ మొత్తం ఆదాయం ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 30,191 కోట్ల రూపాయలకు క్షీణించిందని ఐసిఐసి బ్యాంకు స్పష్టం చేసింది. స్టాండలోన్ ప్రాతిపదికన గత ఏడాది రెండో త్రైమాసికంలో 3,102 కోట్ల రూపాయలుగా ఉన్న తమ నికర లాభం ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 34 శాతం క్షీణించి 2,058 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.22,759 కోట్ల నుంచి 18,763 కోట్ల రూపాయలకు తగ్గిందని, అయితే గత ఏడాది రెండో త్రైమాసికంలో రూ.5,253 కోట్లుగా ఉన్న తమ నికర వడ్డీ ఆదాయం ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 9 శాతం వృద్ధిచెంది 5,709 కోట్ల రూపాయలకు పెరిగిందని ఐసిఐసిఐ బ్యాంకు వివరించింది. ఏడాది క్రితం 6.12 శాతంగా ఉన్న తమ స్థూల నిరర్థక ఆస్తులు ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో 7.87 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 3.21 శాతం నుంచి 4.43 శాతానికి పెరిగాయని ఐసిఐసిఐ బ్యాంకు వెల్లడించింది.
అలాగే, దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకు నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో 27.1 శాతం క్షీణించి 260.18 కోట్లకు పడిపోయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ బ్యాంకు 357 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. అలాగే గత ఏడాది రెండో త్రైమాసికంలో రూ.12,187.12 కోట్లుగా ఉన్న తమ మొత్తం ఆదాయం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో 11,994.64 కోట్లకు తగ్గిందని, నిరర్థక ఆస్తులు పెరగడమే ఇందుకు కారణమని కెనరా బ్యాంకు శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజీకి తెలియజేసింది. ఏడాది క్రితం 9.81 శాతంగా ఉన్న తమ స్థూల నిరర్థక ఆస్తులు ఈ ఏడాది రెండో త్రైమాసికం ముగిసే నాటికి 10.51 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 6.69 శాతం నుంచి 7.02 శాతానికి పెరిగాయని ఆ బ్యాంకు వివరించింది.
లాభాల బాటలో జమ్మూ-కాశ్మీర్ బ్యాంకు
ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో జమ్మూ-కాశ్మీర్ బ్యాంకు 71.7 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో తాము రూ.602.40 కోట్ల నష్టాన్ని నమోదు చేసినట్లు ఆ బ్యాంకు వెల్లడించింది. అయితే గత ఏడాది రెండో త్రైమాసికంలో 1,816.67 కోట్ల రూపాయలుగా తమ మొత్తం ఆదాయం ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 1,771.46 కోట్లకు, స్థూల నిరర్థక ఆస్తులు 11.3 శాతం నుంచి 10.8 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 6.81 శాతం నుంచి 4.76 శాతానికి తగ్గాయని ఆ బ్యాంకు శుక్రవారం ఒక ప్రకటనలో వివరించింది.